రవితేజతో స్టెప్స్ వేయడానికి వర్మ బోల్డ్ బ్యూటీ అప్సరా రాణిని దించారు. ఓ పబ్ సెట్ లో రవితేజ మరియు అప్సరా కిక్కెక్కించే స్టెప్స్ తో వెండితెరపై అగ్గిరాజేయనున్నారట. ఆ క్రేజీ అప్డేట్ ని క్రాక్ చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దర్శకుడు గోపిచంద్ మలినేని మాస్ మహరాజ్ రవితేజతో చేస్తున్న చిత్రం క్రాక్. రవితేజ పోలీస్ అధికారిగా నటిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోగా మూవీపై భారీ అంచనాలున్నాయి. హీరోయిన్ శృతి హాసన్ రవితేజకు జంటగా నటిస్తుంది. 

కొద్దిరోజుల్లో విడుదల సిద్ధం అవుతున్న ఈ మూవీ కోసం ఓ మాస్ మసాలా ఐటెం నంబర్ ని తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన పబ్ సెట్ లో ఈ సాంగ్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ ఐటెం సాంగ్ కోసం వర్మ థ్రిల్లర్ ఫేమ్ అప్సరా రాణిని తీసుకున్నారు. చిన్న గౌను, జాకెట్ వేసి గ్లామర్ తో సెగలు రేపుతున్న అప్సర లుక్ చూస్తుంటే సాంగ్ తో వెండితెరను వేడిక్కించడం ఖాయంగా కనిపిస్తుంది. 

మొదటిసారి అప్సరా రాణి క్రాక్ మూవీ కోసం ఐటెం అవతారం ఎత్తింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా , జోష్ నింపే మాస్ ట్యూన్స్ ఇచ్చి ఉంటాడు. ఇక ఈ సాంగ్ కి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. చిత్ర యూనిట్ మొత్తం సెట్ లో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక థ్రిల్లర్ అనే వెబ్ మూవీలో రెచ్చిపోయిన అందాలు ప్రదర్శించిన అప్సరా రాణి, వర్మ తెరకెక్కిస్తున్న మరో చిత్రం డేంజరస్ లో మరింత రెచ్చిపోయి నటించినట్లుంది.