Asianet News TeluguAsianet News Telugu

సూర్య హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన స్టూడెంట్.. వేదికపైనే చేయి పట్టుకుని లాగి..

సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది.సుధా కొంగరా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో సూర్యకి జోడిగా బొద్దుగుమ్మ అపర్ణ బాలమురళి నటించింది.

Aparna balamurali gets bad experience with college student
Author
First Published Jan 19, 2023, 1:12 PM IST

సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా చిత్రం విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది. IMDB లో అత్యధిక రేటింగ్ సాధించిన చిత్రాల్లో ఇది కూడా ఒకటిగా రికార్డు సృష్టించింది. క్రిటిక్స్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు ఈ చిత్రంతో సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. 

సుధా కొంగరా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో సూర్యకి జోడిగా బొద్దుగుమ్మ అపర్ణ బాలమురళి నటించింది. ఆమె నటనకి కూడా ప్రశంసలు దక్కాయి, మధ్యతరగతి మహిళగా ఈ చిత్రంలో ఆమె బాగా సెట్ ఐంది. 

ప్రస్తుతం అపర్ణ బాలమురళి 'తన్కమ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. ప్రమోషన్స్ లో భాగంగా తన్కమ్ మూవీ టీం కేరళలోని ఓ కాలేజీలో పర్యటించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ప్రినీష్ ప్రభాకరన్, హీరో వినీత్ శ్రీనివాసన్ తో పాటు అపర్ణ కూడా పాల్గొంది. 

అయితే ఓ విద్యార్థి వేదికపై ఉన్న అపర్ణతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేదికపైకి అనూహ్యంగా వచ్చిన ఓ విద్యార్ధి అపర్ణ చేయి పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. ఫోటో కావాలని బలవంతం చేశాడు. ఇబ్బందిగా ఫీల్ అవుతూనే అపర్ణ అతడితో ఫోటో దిగేందుకు అంగీకరించింది. 

ఆ స్టూడెంట్ అంతటితో ఆగకుండా అపర్ణ భుజంపై చేయి వేస్తూ మితిమీరి ప్రవర్తించాడు. దీనితో అపర్ణ అతడి నుంచి తప్పించుకుని అసహనం వ్యక్తం చేసింది. కంట్రోల్ కోల్పోకుండానే ఆ విద్యార్థి నుంచి తప్పించుకుని తిరిగి వెళ్లి కూర్చుంది. 

దీనితో సదరు విద్యార్థి ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విద్యార్థి సారీ చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు చిత్ర యూనిట్ మొత్తం వేదికపైనే కూర్చుని ఉన్నారు. కానీ ఒక్కరు కూడా ఆ యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీనిపట్ల కూడా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios