ఏపీలో నిర్ణయించిన టికెట్స్ ధరలు వలన నా వరకు ఎటువంటి సమస్య లేదు. తక్కువ ధరల వలన నా సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదని సూటిగా చెప్పేశారు . ఒక పక్క ధరలపై సీరియస్ వార్ నడుస్తుంటే నాగార్జున చాలా సింపుల్ గా ఈ సమస్యను తీసిపారేశారు.
చిరంజీవి, బాలకృష్ణ (Balakrishna), నాగార్జున, వెంకటేష్.. ఈ నలుగురు మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ని ఏలిన టాప్ హీరోలు. ఈ నలుగురి మధ్య మంచి సాన్నిహిత్యం, స్నేహం ఉంది. అదే సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఉన్నాయి. అయితే చిరంజీవి, నాగార్జున మాత్రం చాలా క్లోజ్. ప్రతి విషయంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. కలిసి వ్యాపారులు కూడా చేశారు. తరచుగా ఒకరింటికి మరొకరు వెళ్లడం, డిన్నర్లు, లంచ్లు కలిసి చేస్తూ ఉంటారు.
నాగార్జున(Nagarjuna) కోసం చిరంజీవి స్వయంగా వండి వడ్డించిన సందర్భాలు కూడా ఉన్నాయి.నాగార్జున గత చిత్రం వైల్డ్ డాగ్ కి చిరంజీవి మాట సాయం చేశారు. మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకోగా స్వయంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైల్డ్ డాగ్ అద్భుతం, అందరూ చూడాలంటూ ప్రమోట్ చేశారు. నాగార్జున అంటే చిరంజీవికి అంత అభిమానం. ఇక పరిశ్రమ గురించి వీరి అభిప్రాయాలు కూడా ఒక్కటే.అయితే మొదటిసారి టికెట్స్ ధరల విషయంలో భిన్నంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్స్ ధరలు(Ap Ticket prices) తగ్గిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవోను చిరంజీవి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టికెట్స్ ధరల విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని.. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలతో పరిశ్రమ మనుగడ సాధ్యం కాదని వాదిస్తున్నారు. పలుమార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి చిరంజీవి విజ్ఞప్తులు సమర్పించారు. చిరంజీవి టికెట్స్ ధరల గురించి సీరియస్ గా ఉంటే.. నాగార్జున సిల్లీగా కొట్టిపారేశారు. ఏపీలో అమలవుతున్న టికెట్స్ ధరలతో వచ్చిన ఇబ్బందేమీ లేదంటూ కొట్టిపారేశారు.
జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాగార్జున.. సినిమా వేదికలపై పాలిటిక్స్ మాట్లాడకూడదు. ఇక ఏపీలో నిర్ణయించిన టికెట్స్ ధరలు వలన నా వరకు ఎటువంటి సమస్య లేదు. తక్కువ ధరల వలన నా సినిమాకు వచ్చిన నష్టం ఏమీ లేదని సూటిగా చెప్పేశారు . ఒక పక్క ధరలపై సీరియస్ వార్ నడుస్తుంటే నాగార్జున చాలా సింపుల్ గా ఈ సమస్యను తీసిపారేశారు. అంతటితో ఆగకుండా ఏపీలో టికెట్స్ ధరలు వలన పరిశ్రమకు వచ్చిన నష్టం ఏమీ లేదని పరోక్షంగా అభిప్రాయం తెలియజేశారు.
నాగార్జున వ్యాఖ్యలు చిరంజీవి(Chiranjeevi)ని ఖచ్చితంగా బాధపెట్టి ఉంటాయి. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఇలా మాట్లాడితే చిరంజీవితో పాటు కొందరికి కాలుతుందని నాగార్జున తెలియదనుకుంటే పొరపాటే. మరి అన్నీ తెలిసి నాగార్జున ఏదో డిప్లొమాటిక్ సమాధానం చెప్పి తప్పుకోకుండా.. స్ట్రైట్ గా కుండబద్దలు కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. తాజా పరిణామంతో చిరంజీవితో నాగార్జున విబేధాలు తలెత్తే ఆస్కారం కలదు. ఒకవేళ ఆల్రెడీ ఏదైనా విషయమై ఇద్దరి మధ్య దూరం పెరగడం వలెనే నాగార్జున ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు.
ఒక్కటి మాత్రం నిజం.. టికెట్స్ ధరల తగ్గింపుపై పరిశ్రమలో ఏకాభిప్రాయం లేదు. నాగార్జునతో పాటు నట్టి కుమార్, సి ఎల్ వి నరసింహారావు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. మూడు నెలలుగా ఈ వివాదం నడుస్తున్నా.. పవన్ కళ్యాణ్, నాని, చిరంజీవి లాంటి వాళ్ళు మాత్రమే స్పందించడం వెనుక కారణం ఇది కూడా కావచ్చు.
