పూనమ్ సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను ఫ్యాట్సో అంటూ పవన్-కత్తి వివాదంలో తలదూర్చటంతో కత్తి మహేష్ పూనమ్ పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `జ‌ల్సా` సినిమాలో క‌మలినీ పాత్ర కోసం తొలుత పూన‌మ్ కౌర్‌ను తీసుకున్నారని, ఆ సినిమా ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా జ‌రిగిన పూజ‌ల్లోనే ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి పూన‌మ్ పాల్గొందని, అయితే ఆ త‌ర్వాత ప‌వ‌న్ సరసన పూన‌మ్ సెట్ కాదని భావించి దర్శకుడు క‌మ‌లినీని తీసుకున్నాడని పవన్ కల్యాణ్ అభిమానులు వివరించారు. తద్వారా పూజలపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ అభిమానులు సమాధానం చెప్పారు.

 

సినీ పరిశ్ర‌మ‌లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి జేజారటం లాంటివి సాధార‌ణ‌మే అయినప్పటికీ కెరీర్‌ సమస్యల్లో పడిందనే బాధతో పూన‌మ్ డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకుందని పవన్ కల్యాణ్ అభిమానులు చెప్పారు. దీనికి తాను కూడా ఎంతో కొంత కార‌ణం అని భావించిన ప‌వ‌న్ కల్యాణ్ ఆమెను ఆస్పత్రికి వెళ్లి ప‌రామ‌ర్శించి బిల్లు క‌ట్టారని చెప్పారు. పూన‌మ్ కెరీర్‌లో స్థిర‌ప‌డ‌డానికి త‌న వంతుగా స‌హాయం చేస్తానని పూన‌మ్ త‌ల్లికి మాటిచ్చినట్లు తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎవ‌రిని పెట్టాలని ఆలోచిస్తున్న‌ప్పుడు పూన‌మ్ కౌర్ పేరును ప‌వ‌న్ కల్యాణ్ సూచించారని ఆయన అభిమానులు చెప్పారు. ఇందులో ప‌వ‌న్ చేసిన త‌ప్పేమీ లేదని స్పష్టం చేశారు. అలా పవన్ కల్యాణ్ అభిమానులు కత్తి మహేష్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. పరిస్థితిని చక్కదిద్దటానికి అవసరమైన చర్యలు ప్రారంభమైనట్లు కనిపిస్తోంది.

 

చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా పూనమ్ కౌర్‌ నియామకం ఎలా జరిగిందో చెప్పాలని కత్తి మహేష్ చేసిన విమర్శలతో.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ చిక్కుల్లో పడేయడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. తాజాగా పూనమ్ కౌర్ నియామకంపై సర్కారు క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో వివాదం సద్దుమణిగే వాతావరణం ఏర్పడుతుందా లేదా చూడాలి.