ఏపీ ప్రభుత్వం సినీ ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో థియేటర్లకి అనుమతినిచ్చింది. 50% సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించుకోవచ్చని స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం సినీ ప్రియులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో థియేటర్లకి అనుమతినిచ్చింది. 50% సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపించుకోవచ్చని స్పష్టం చేసింది. కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సోమవారం పలు సడలింపులు చేపట్టింది. అందులో భాగంగా థియేటర్లని తెరచుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ నెల 8నుంచి సీట్ల మధ్య ఖాళీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ థియేటర్లు నడిపించుకోవచ్చని పేర్కొంది. మరి ఎగ్జిబిటర్లు థియేటర్లని ఓపెన్ చేస్తారా? జనం థియేటర్ కి వస్తారా? అన్నది సస్పెన్స్ గా ఉంది.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలను ప్రశ్నించింది. థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ఇంకా ప్రారంభించకపోవడానికి కారణమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు నిర్మాతలు డి సురేష్‌బాబు, దిల్‌రాజు, కె.ఎల్ దామోదర్‌ప్రసాద్, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్లు, సినిమాల విడుదలకు సంబంధించి ఉన్నసమస్యలను సీఎస్‌కి వివరించారు.
2018లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత పార్కింగ్ నిర్ణయం తీసుకుంది. తిరిగి పార్కింగ్ చార్జీలకు అనుమతి ఇస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడే అవకాశం ఉంటుందని, పార్కింగ్ నుంచి థియేటర్లకు 40శాతం రాబడి ఉంటుందని నిర్మాతలు, థియేటర్ యజమానులు సీఎస్‌కు విన్నవించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ విషయాలపై సీఎస్ సోమేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఎస్ నిర్మాతలకు హామీ ఇచ్చారని తెలుస్తుంది.
