అప్పట్లో వచ్చిన 'సైజ్ జీరో’ సినిమా కోసం అమాంతం బరువు పెరిగిపోయి కష్టాలు కొనితెచ్చుకున్న దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క.  ఇప్పుడు తిరిగి సన్నగా తయారై, మళ్లీ సినిమాకు సిద్ధమైంది. ‘సైజ్ జీరో’ తరువాత బాహుబలి, భాగమతి సినిమాల్లో నటించి హిట్ కొట్టినా, ఆపై దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది.

 ఆ తర్వాత  పెరిగిన బరువును తగ్గించుకునేందుకు నానాపాట్లూ పడ్డ అనుష్క, ఇప్పుడు తాను బరువు తగ్గిన విధానాన్ని వివరిస్తూ ఓ పుస్తకం రాసింది.   ఇది ఇంగ్లీష్ భాషలో విడుదల అయ్యింది.  ఈ సీక్రెట్స్‌ను అనుష్క ఓ పుస‌క్త రూపంలో చెప్ప‌ింది. 

`ది మ్యాజిక్ వెయిట్ లాస్ పిల్‌` అనే పేరుతో అనుష్క‌, ల్యూక్ కుటిన్‌హో ఓ పుస్త‌కాన్ని రాశారు. మ‌న లైఫ్ స్ట‌యిల్లో మ‌నం ఫాలో కావాల్సిన 62 ప‌ద్ధ‌తులు ఈ పుస‌క్తంలో ఉంటాయి.  ఈ పుస్త‌కం మార్కెట్లో ఉంది. అమెజాన్ లోనూ ఈ పుస్తకం దొరకుతోంది. 

 ప్ర‌స్తుతం అనుష్క మాధ‌వ‌న్‌తో క‌లిసి `సైలెన్స్` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్, షాలినీ పాండే తదితరులు నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.‘వస్తాడు నా రాజు’ ఫేం హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించనున్నారు.  ఇందులో సుబ్బరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు