అనుష్క, విరాట్ ఇప్పుడు పవర్ కపుల్.. ఈ జంట ఆస్తులెన్నో తెలుసా

First Published 13, Dec 2017, 8:42 PM IST
anushka virat kohli properties value
Highlights
  • ఇటలీలో వివాహం చేసుకున్న విరాట్ , అనుష్క
  • నూతన దంపతులను పవర్ కపుల్ అంటున్న నెటిజన్లు
  • ఇద్దరి ఆస్తులు కలిపి కోట్లల్లో... ఏడాదిలో 140 శాతం  పెరిగే అవకాశం.. వివరాలు

క్రికెటర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హిరోయిన్ అనుష్క శర్మ వివాహం ఇటలీలో అంగరంగవైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి వేడుక ఇపుడు ఇండియాలో హాట్ టాపిక్. ఈ సెలబ్రిటీ కపుల్‌ను ఇపుడు అంతా 'పవర్ కపుల్' అని పిలుస్తున్నారు. తాజాగా వీళ్ల ఆస్తులు లెక్కగట్టిన ఓ బ్రాండ్ ఎనలిస్ట్ వీళ్లిద్దరి ఆస్తులు కలిపి దాదాపు రూ. 600 కోట్లు ఉంటుందని లెక్కతేల్చారు.

 

"విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వివాహం ఇండియన్ బ్రాండ్ మార్కెట్‌లో బిగ్గెస్ట్ మూమెంట్. ఇద్దరూ సమాన బలంతోపాటు అవకాశాలు కలిగి ఉన్నారు. ఈ జంట ఆస్తుల విలువ వచ్చే రెండేళ్లలో రూ. 1000 కోట్లకు చేరుతుందని ఈజీగా చెప్పగలను" అని ఎనలిస్ట్  శైలేంద్ర సింగ్ తెలిపారు.

 

ఇపుడు ఇద్దరూ భార్య భర్తలు అయ్యారు కాబట్టి స్టెబిలిటీ, ఫ్యామిలీ, ట్రూ అండ్ లాయల్టీ అనే కొత్త కేటగిరీలో... హౌస్ లోన్స్, కార్లు, ఇన్సూరెన్స్ లాంటి రంగాల్లో వీరికి మరిన్ని బ్రాండ్ ఎండోర్స్ మెంట్లు వచ్చే అవకాశం ఉందని శైలేంద్ర సింగ్ తెలిపారు.

 

ఫిన్ యాప్ అంచనా ప్రకారం... విరాట్ కోహ్లి రూ. 382 కోట్లు, అనుష్క శర్మ రూ. 220 కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగి ఉన్నారు. విరాట్ కోహ్లి మ్యాచ్ ఫీజు, ఐపీఎల్ సాలరీ, ఇతర ఆదాయం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ఈ భారీ మొత్తం సంపాదించారు. అనుష్క శర్మ సినిమాల రెమ్యూనరేషషన్, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా ఇంత ఆస్తి కూడబెట్టిందట. గడిచిన మూడేళ్లలో అనుష్క ఆదాయం 80శాతం పెరిగింది. ఈ అంచనాల ప్రకారం వచ్చే మూడేళ్లలో ఆమె ఆస్తుల విలువ 30 శాతం, సంవత్సర ఆదాయం 18 శాతం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

 

అనుష్క ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. బ్రాండ్ ఎండార్స్మెంట్లకు రూ. 4 కోట్లు చార్జ్ చేస్తున్నారు. ఆమె రియల్ ఎస్టేట్ రంగంలో ముంబైతో పాటు ఇండియా వ్యాప్తంగా రూ. 40 కోట్లు వ్యక్తిగతంగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో పాటు రూ. 5 కోట్ల విలువ చేసే బిఎండబ్ల్యు, రేంజ్ రోవర్, మెర్సిడెజ్ బెంజ్ కార్లు కలిగి ఉన్నారు.

 

విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ. 120 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. అతడి వరల్డ్ క్లాస్ రికార్డ్స్ వల్ల ప్రపంచంలో హయస్ట్ పెయిడ్ స్పోర్ట్స్ సెలబ్రిటీగా, స్పోర్ట్స్ ప్లేయర్‌గా వెలుగొందుతున్నాడు. అతడికి రూ. 9 కోట్ల విలువ చేసే ఆరు కార్లు మెర్సిడెజ్, ఆడి, బిఎండబ్ల్యు, వాగ్స్ వ్యాగన్ ఉన్నాయి.

 

ఇక ఫినాప్ రిపోర్ట్ అంచనాల ప్రకారం... విరాట్ ఆదాయం రాబోయే కాలంలో 140 శాతం పెరుగుతుందట. ఈ నేపథ్యంలో అతిడి ఆస్తులు భారీగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇండస్ట్రీలో ‘పవర్‌ కపుల్‌'గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్‌, అనుష్క ఇప్పటికే 28 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఇద్దరూ కలిసి బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరించే అవకాశాలు ఉందని శైలేంద్ర సింగ్ తెలిపారు.

loader