అనుష్క, విరాట్ కొహ్లీల పెళ్లికి ముహూర్తం ఖరారు ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందంటూ పుకార్లు షికారు కొత్త సంవత్సరం తొలిరోజున ఇద్దరూ ఒకటవుతారని రూమర్స్ రూమర్స్ నిజం చేస్తూ దర్శనమిస్తున్న స్టార్స్ ఫోటోలు

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ లేడీ అనుష్క శర్మ ల పెళ్లి తంతు దగ్గర పడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ఇద్దరూ కొత్త సంవత్సరం తొలి రోజు నాడు ఒక్కటయ్యేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని తెలుస్తోంది. దానికి రుజువుగా కొన్ని ఆధారాలు కూడా ఉండటంతో అది నిజమే అనిపిస్తోంది. అదేంటో మీరు కూడా చూడండి.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డెహ్రాడూన్ వెళ్లిన భారత క్రికెట్ టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ నటీమణి అనుష్క శర్మలు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారా? సింపుల్ గా జరిగిన ఈ కార్యక్రమానికి కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వేత్తలు కూడా హాజరయ్యారా? అంటే ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

విరాట్ , అనుష్కలు డెహ్రాడూన్ కు కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసివెళ్లారని మొదట్లోనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత అక్కడ నుంచి వీరు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్టు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. వీరు రుద్రాక్ష మాలలు ధరించి ఫొటోలు దిగడంతో నిశ్చితార్థం ఊహాగానాలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు వీరి వెంట ఉండటం ఆ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

ఇక వీళ్లు ఆ టూర్లో ఉండగానే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, రిలయన్స్ అంబానీల కుటుంబం కూడా డెహ్రాడూన్ లో అగుపించడం ఆసక్తికరంగా మారింది. వీరంతా అక్కడకు ఎందుకు వెళ్లారో కానీ.. ఇదంతా విరాట్- అనుష్కల నిశ్చితార్థ సంబరమే అనే ప్రచారం ఊపందుకుంది.

ఇదే సమయంలో ఒక పూజారి పక్కన విరాట్- అనుష్కలు దిగిన ఫోటో.. ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లింది. వీళ్లకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందనే వార్త హోరెత్తుతోంది. మరి అసలు కథ ఏమిటో.. డెహ్రాడూన్ లోని సెలబ్రిటీలే చెప్పాలి!