దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క 'భాగమతి' తరువాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుంది. తన శరీర బరువుని తగ్గించుకోవడం కోసం అమ్మడు తదుపరి సినిమా విషయంలో ఆలస్యం చేస్తోందని అన్నారు.

కానీ ఇటీవల దర్శకుడు హేమంత్ మధుకర్ చెప్పిన కథ నచ్చడంతో అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలో మాధవన్ హీరోగా  కనిపించనున్నాడు. కోన వెంకట్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అనుష్క అంధురాలిగా కనిపించనుందని సమాచారం. అంతేకాదు.. తన పాత్రకి వినికిడి శక్తి లోపం కూడా ఉంటుందట.

ఆ కారణంగానే ఈ సినిమాకు 'సైలెన్స్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని టాక్. జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎక్కువ భాగం షూటింగ్ అమెరికాలోనే చిత్రీకరిస్తారట. ఈ సినిమాలో హాలీవుడ్ కి చెందిన కొందరు పేరున్న తారలు కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఇది ఇలా ఉండగా.. అనుష్క తన బరువు ఏమాత్రం తగ్గలేదని కొన్ని ఫోటోల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆమె రాజమౌళి కొడుకు పెళ్లి కోసం జైపూర్ వెళ్లింది. ఎయిర్ పోర్ట్ లో కొందరు ఆమెని ఫోటోలు తీయగా.. అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.