తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ తో సినిమా చేయాలనుకునే దర్శకనిర్మాతల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందిస్తోన్న నిర్మాత విష్ణు ఇందూరి దర్శకుడు కెఎల్ విజయ్ కాంబినేషన్ లో జయలలిత బయోపిక్ రూపొందనున్నట్లు ప్రకటించాడు. ఇందులో జయలలిత పాత్ర కోసం నయనతార, త్రిష, విద్యాబాలన్, సోనాక్షి సిన్హా వంటి తారల పేర్లు వినిపిస్తున్నాయి.

మరి అనుష్క పేరు తెరపైకి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా..? తాజాగా దర్శకుడు భారతీరాజా కూడా జయలలిత బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నాడు. 'అమ్మ పురట్చి తలైవి' అనే పేరుతో ఈ బయోపిక్ రూపొందనుంది. ఆదిత్య భరద్వాజ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. డిశంబర్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే భారీ స్కేల్ లో ఈ సినిమాను రూపొందించాలని అనుకుంటున్నారు.

అందుకే జయలలిత పాత్ర కోసం అనుష్క, ఐశ్వర్యరాయ్ వంటి తారలను తీసుకోవాలని అనుకుంటున్నారు. అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమెతోనే సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఎంజిఆర్ పాత్ర కోసం కమల్ హాసన్ ని సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. కమల్ కాదంటే మాత్రం మోహన్ లాల్ ని తీసుకుంటారట. జయలలితపై ఈ రెండు బయోపిక్స్ తో పాటు ప్రియదర్శిని అనే మరో డైరెక్టర్ కూడా సినిమా ప్రకటించారు.