Asianet News TeluguAsianet News Telugu

అనుష్క తదుపరి చిత్రం అజిత్ తో..

  • వివేకం సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అజిత్
  • అజిత్ తదుపరి చిత్రం విశ్వాసం లో హిరోయిన్ గా అనుష్క
  • అజిత్ తో గతంలో ఎంతవాడుగానీ చిత్రంలో నటించిన అనుష్క
anushka shetty to act again with ajith

తమిళనాట అజిత్‌ సినిమాలకి ఇప్పుడున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అజిత్‌ తాజా చిత్రం 'వివేగం'  ఏ స్థాయిలో వసూళ్ళను కొల్లగొట్టిందో చూశాం. వరుసగా శివ డైరెక్షన్‌లో హిట్టు మీద హిట్టు కొడ్తోన్న అజిత్‌, తాజాగా తన దర్శకత్వంలోనే 'విశ్వాసం' పేరుతో ఓ సినిమాకి కమిట్‌ అయాడు. 

 

త్వరలో పట్టాలెక్కనున్న 'విశ్వాసం' సినిమా కోసం అజిత్‌, హీరోయిన్‌గా అనుష్క పేరుని ఫైనలైజ్‌ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అజిత్‌, అనుష్క కాంబినేషన్‌లో 'ఎంతవాడుగానీ' పేరుతో (తమిళంలో 'ఎన్నయ్‌ అరిందాల్‌') ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో త్రిష మరో హీరోయిన్‌గా నటించింది. అయితే అదొక థ్రిల్లర్‌ మూవీ. అజిత్‌ - అనుష్క మధ్య పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్‌ అవలేదు కూడా. 

 

ఈసారి మాత్రం, అజిత్‌ - అనుష్క మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుట్‌ అవుతుందట. ఇదొక రొమాంటిక్‌ థ్రిల్లర్‌ అనే ప్రచారం జరుగుతోంది. అజిత్‌ సినిమాలంటే క్లాస్‌ టచ్‌ మాత్రమే కాదు, మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా పుష్కలంగా వుంటాయి. పైగా, ఈసారి పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ తరహాలో 'విశ్వాసం' సినిమాని శివ తెరకెక్కించబోతున్నాడట.

Follow Us:
Download App:
  • android
  • ios