క్రేజీ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంలో నటిస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం యుఎస్ లో ఎక్కువభాగం షూటింగ్ జరిగింది. యుఎస్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. బాహుబలి తర్వాత అనుష్క కేవలం భాగమతి చిత్రంలో మాత్రమే నటించింది. ఆ చిత్రం తర్వాత అనుష్క కాస్త బొద్దుగా మారింది. సినిమాలు కూడా చేయకపోవడంతో అనేక రూమర్లు విపించాయి. 

కానీ అనుష్క్ విదేశాలకు వెళ్లి తన లుక్ కు అద్భుతంగా మార్చుకుంది. స్లిమ్ గా మారి ఆశ్చర్యపరిచింది. యూఎస్ లో షూటింగ్ పూర్తయిన తర్వాత  ఇటీవల అనుష్క హైదరాబాద్ కు తిరిగొచ్చింది. విమానాశ్రయంలో అనుష్క కనిపించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

అనుష్క లేటెస్ట్ లుక్ షాకిచ్చే విధంగా ఉంది. అనుష్క మళ్ళీ బొద్దుగా మారినట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో అనుష్క సైజ్ జీరో చిత్రం కోసం కూడా బొద్దుగా మారింది. ఆ తర్వాత మళ్ళీ నాజూకు లుక్ లో కనిపించింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం చిత్రం తెరకెక్కుతుండగా.. కోనవెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.