మూఢ న‌మ్మ‌కాలు, క్షుద్ర పూజ‌లు, ఆత్మ‌లూ వంటి వాటితో  ఫాంట‌సీ క‌థ ఇది చెప్తున్నారు.  టెక్నిక‌ల్ గా ఈ సినిమాని హై స్టాండ‌ర్డ్స్‌లో తీర్చిదిద్దుతున్నట్లు వినిపిస్తోంది. 

అనుష్క ఇంతకాలం పాజిటివ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అయితే అవి బోర్ కొట్టాయో ఏమో కానీ ఇప్పుడు ఓ నెగిటివ్ రోల్ లో ఆమె కనపడబోతోందని తెలుస్తోంది. ఫస్ట్ టైమ్ ఆమె ఇలాంటి పాత్ర కమిటైందని నటనకు అవకాసం ఉన్న పాత్ర అని చెప్తున్నారు. అయితే ఈ పాత్రలో ఆమెకు రెండు షేడ్స్ ఉంటాయని , అయితే అది డ్యూయిల్ రోలా లేక ఒక్కరే ఇద్దరిగా కనపడతారా అనేది తెలియాల్సి ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇంతకీ ఏ సినిమా కోసం ఆమె నెగిటివ్ రోల్ చెయ్యబోతోంది అంటే... 

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో 'కథనార్' అనే హారర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాతోనే అనుష్క మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రోజిన్ థామస్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. రీసెంట్ గా ఆమె షూటింగ్ లోజాయిన్ అయ్యింది. మూఢ న‌మ్మ‌కాలు, క్షుద్ర పూజ‌లు, ఆత్మ‌లూ వంటి వాటితో ఫాంట‌సీ క‌థ ఇది చెప్తున్నారు. టెక్నిక‌ల్ గా ఈ సినిమాని హై స్టాండ‌ర్డ్స్‌లో తీర్చిదిద్దుతున్నట్లు వినిపిస్తోంది. ఈ సినిమా కోసం వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఆ విధానంలో రూపొందే మొట్ట మొదటి ఇండియన్ ఫిల్మ్ ఇదే. అనుష్క నెగిటివ్ రోల్ చేస్తోందని, అది ట్విస్ట్ లా రివీల్ అవుతుందని మళయాళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. 

అతీంద్రియ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమతుత్తు కథనార్ కథల ఆధారంగా ఈ సినిమాని తరకెక్కిస్తున్నారు. పలు యదార్థ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ హారర్ మూవీ కడమట్టు అనే ప్రాంతంలోని ఓ చర్చి ఫాదర్ జీవితం నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ 'అరుంధతి' మూవీ తరహాలో చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని అంటున్నారు. ఒక సూపర్ నాచురల్ హారర్ సినిమాలో అనుష్క శెట్టి కూడా భాగం కావడం ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. పాన్ ఇండియన్ భాషలతో కలిపి మొత్తం 14 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న మొదటి పాన్ వరల్డ్ మూవీ, ఆమెకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.