న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’హిట్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.  నాని నటన, గౌతమ్‌ దర్శకత్వ ప్రతిభ ను అందరూ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా నాని ‘అర్జున్‌’ అనే క్రికెటర్‌గా కనిపించి అదరకొట్టారు. దాంతో ఈ సినిమా ని చూసిన టాలీవుడ్ సెలబ్రెటీలంతా తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై తన స్పందనను తెలియజేసింది  స్టార్ హీరోయిన్ అనుష్క. 

రీసెంట్ గా ఈ సినిమాను చూసిన అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జెర్సీ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘జెర్సీ’ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగించిదని.... ఈ చిత్రంలోని మ్యాచ్‌ చూశాక నేను పొందిన అనుభూతిని వివరించేందుకు మాటలు రావట్లేదని ఆమె రాసుకొచ్చింది. అలాగే ఈ సినిమా... నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌ ని అందించింది అన్నారు.. నాని, డైరెక్టర్ గౌతమ్, చిత్ర చిత్రయూనిట్ కు బెస్ట్ విషెష్ అని అనుష్క కామెంట్స్ పోస్ట్ చేసింది. 

ఇంతకు ముందు ఎన్టీఆర్ సైతం ఈ సినిమా చూసి... అద్భుతం, అద్భుతం, అద్భుతం ! ఇదో అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో నీ నటనను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రోలర్‌ కోస్టర్‌లో రైడ్‌ చేసిన అనుభూతిని కలిగించింది. ఇలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకుని దానిని పక్కాగా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ప్రతిభకు హాట్సాఫ్‌. అదే విధంగా గౌతం విజన్‌కు తగ్గట్లుగా నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గౌతమ్‌ విజన్‌ను అర్థంచేసుకుని, ఆయనకు మద్దతిచ్చినందుకు చిత్రబృందానికి అభినందనలు’ అని తార‌క్ పేర్కొన్నారు.