అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి ఇటీవల సినిమాల స్పీడు బాగా తగ్గించింది. అనుష్క ఏడాదికి ఒక్క సినిమాలో కనిపించడం కూడా కష్టమైపోతోంది. దీనితో అనుష్క అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు.
అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి ఇటీవల సినిమాల స్పీడు బాగా తగ్గించింది. అనుష్క ఏడాదికి ఒక్క సినిమాలో కనిపించడం కూడా కష్టమైపోతోంది. దీనితో అనుష్క అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. గత ఏడాది అనుష్క నటించిన నిశ్శబ్దం అనే చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది.
దీనితో అనుష్క నుంచి ఫ్యాన్స్ ఓ సాలిడ్ మూవీ కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బాహుబలి పూర్తయినప్పటి నుంచి అనుష్క పెళ్లిపై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. ఆమె కుటుంబ సభ్యులు అనుష్కకు పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని..అందుకే అనుష్క సినిమాల సంఖ్య బాగా తగ్గించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా ఎలాంటి న్యూస్ లేదు.
ఇదిలా ఉండగా స్వీటీ ఫాన్స్ కి సంతోషపరిచే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. అనుష్క ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమలాపాల్ మాజీ భర్త దర్శకుడు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో నటించేందుకు అనుష్క ఒకే చెప్పినట్లు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి.
విజయ్ ఓకే ప్రయోగాత్మక కథని అనుష్కకి చెప్పగా స్వీటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇది వుమెన్ సెంట్రిక్ గా జరిగే కథ. సో అనుష్క మరోసారి లేడి ఓరియెంటెడ్ చిత్రంతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు టాక్.
ప్రస్తుతం అనుష్క తన ఫిట్ నెస్ మెరుగుపరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బాహుబలి తర్వాత అనుష్క కొంత బరువుగా మారింది. బరువు తగ్గేందుకు అనుష్క ప్రయత్నిస్తోంది. డైరెక్టర్ ఏఎల్ విజయ్ చివరగా కంగనా రనౌత్ తో జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రం తెరకెక్కించారు. ఆ మూవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
