ఈ మధ్యకాలంలో చాలా మంది టాలీవుడ్ హీరోలు ఆసుపత్రి పాలయ్యారు. షూటింగ్ లో రిస్కీ స్టంట్ లలో పాల్గొనడంతోగాయాలపాలయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ కారణంగా చాలా సినిమాలకు బ్రేక్ పడింది. ఇప్పుడు మరొక వార్తలు వెలుగులోని వచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కాలికి ఫ్రాక్చర్ అయిందట. ప్రస్తుతం ఆమె నడవలేని పరిస్థితిలో ఉందని టాక్. ఇటీవల 'సై రా' షూటింగ్ లో పాల్గొన్న ఆమె ఆ సమయంలో  నడవలేక బాగా ఇబ్బంది పడిందని సమాచారం. 'సై రా' షూటింగ్ పూర్తయిన వెంటనే ఆమె సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిందని సమాచారం.

ఆమె నటిస్తోన్న 'సైలెంట్' సినిమా షూటింగ్ కి కూడా ఆమె హాజరు కావడం లేదని తెలుస్తోంది. దానికి కారణం ఆమె కాలికి తగిలిన గాయమనే చెబుతున్నారు. చిన్న గాయమే కాబట్టి విషయాన్ని బయటకి రానివ్వకుండా అనుష్క జాగ్రత్తలు తీసుకుంటుందట.

కానీ సినిమా యూనిట్ వర్గాల ద్వారా విషయం బయటకి పొక్కింది. ఇటీవలే ఈ బ్యూటీ తన బరువు తగ్గించుకొని నాజుకుగా తయారైంది. మరి ఇప్పుడు గాయం కారణంగా మళ్లీ లావైపోదు కదా..!