అనుష్క శర్మ ఆస్తుల విలువెంతో తెలుసా.. కళ్లు చెదిరిపోతాయి

First Published 9, Dec 2017, 2:30 PM IST
anushka sharma properties value
Highlights
  • బాలీవుడ్ బ్యూటీల్లో దాదాపు టాప్ ర్యాంక్ లో నిలిచిన అనుష్క శర్మ
  • అనుష్క టాప్ ర్యాంక్  సాధించింది మామూలు విషయంలో కాదు
  • అనుష్క ఆస్తులు చాలామంది బాలీవుడ్ బ్యూటీలకంటే టాప్..ఇంతకీ ఎంత

బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ, విరాట్ కొహ్లీల వివాహం పై దేశమంతా జోరుగా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఈ జంట ఇటలీ వెళ్లినట్లు తెలుస్తున్న నేపథ్యంలో.. ఒక ఫైనాన్షియల్ యాప్ లో ఆనుష్క శర్మ ఆస్తుల విలువపై ఆసక్తి గొలిపే కథనాన్ని ప్రచురించారు. ఇండియాటుడే కథనం ప్రకారం.. అనుష్కా శర్మ వ్యక్తిగత ఆస్తుల విలువ కళ్లు చెదిరే స్థాయిలో ఉంది. దాదాపు దశాబ్దం క్రితం వెలుగులోకి వచ్చిన అనుష్క ఇప్పుడు అత్యంత శ్రీమంతురాలైన హీరోయిన్లలో ముందరి స్థానంలో కనిపిస్తోంది. ఎంతలా అంటే.. ఈమె వ్యక్తిగత ఆస్తుల విలువ రమారమీ రూ.220 కోట్లు అని ‘ఇండియా టుడే’కథనంలో పేర్కొన్నారు.ఇంతకీ ఆ ఆస్తులను ఆనుష్క ఎలా సంపాదించింది? ఎక్కడ పెట్టుబడులు పెట్టింది? అనుష్క సంపాదన ఎలా ఉంది? అనే అంశాల గురించి కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. అనుష్క ప్రతి సినిమాకూ సుమారు పది కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటోందట. హీరోయిన్ గా ఈమె హవా ఇలా నడుస్తోంది. ఇక ఎండార్స్ మెంట్స్ విషయంలో ఒక్కో ఒప్పందం విలువ నాలుగు కోట్ల రూపాయల వరకూ ఉంటోందని సమాచారం. ఇలా సినిమా, యాడ్స్ అవకాశాలు ఈమెకు చేతినిండా ఉన్నాయి. ఇక అనుష్క కొంత కాలం కిందట నిర్మాతగా కూడా మారింది. ఎన్‌హెచ్ 10,ఫిలౌరీ వంటి సినిమాలను నిర్మించింది ఈమె.వీటితో భారీ లాభాలు వచ్చాయని తెలుస్తోంది.
 

 

ఫిలౌరీ చిత్రాన్ని 21 కోట్ల రూపాయలతో నిర్మిస్తే.. అన్నీ కలుపుకుని సుమారు 62 కోట్ల రూపాయల డబ్బులు వచ్చాయట. దాదాపు నలభై కోట్ల రూపాయల పై స్థాయి డబ్బు సంపాదించుకుందట అనుష్క. ఇక అనుష్కకు ముంబైలోని ఖరీదైన ఏరియాల్లో ఫ్లాట్లు, ముంబై చుట్టపక్కల ఫామ్ హౌస్ లు ఉన్నాయని కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. ఏతావాతా వీటన్నింటి విలువను కలుపుకుంటే.. ఆమె ఆస్తులు 220 కోట్లు అనే అంచనాను వేశారు. వీటిల్లో 36 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టిందట ఆమె. వాటిపై ఎప్పటికప్పుడు సంపాదన ఉందని కూడా పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రతియేటా అనుష్క ఆస్తుల విలువ 30శాతం వరకూ పెరగవచ్చునని అంచనా!

loader