అనుష్క మైనపు విగ్రహం.. మాట్లాడుతుందట!

Anushka Sharma gets a talking statue at Madame Tussauds
Highlights

అనుష్క మైనపు విగ్రహానికి ఓ ఫోన్ ఏర్పాటు చేస్తారట. అభిమానులు ఆ ఫోన్ పట్టుకుంటే.. అనుష్క మైనపు బొమ్మ వారితో మాట్లాడుతుందట. ఇప్పటివరకు ఎందరో సెలబ్రిటీల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ అనుష్క విగ్రహం మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. 

సాధారణంగా సెలబ్రిటీల మైనపు విగ్రహాలంటే.. అభిమానులు వాటిని చూసి ఫోటోలు తీసుకోవడం వరకే ఉంటుంది. కానీ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ మైనపు విగ్రహానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంటుందట. అదేంటంటే.. ఈ విగ్రహం అభిమానులను పలకరిస్తుందట. వినడానికి వింతగా ఉన్నా.. ఇటువంటి మైనపు బొమ్మను సొంతం చేసుకోనున్న ఏకైక సెలబ్రిటీ అనుష్క శర్మ కావడం విశేషం.

అసలు విషయంలోకి వస్తే.. సింగపూర్ మ్యూజియంలో అంతర్జాతీయ సెలబ్రిటీలు ఓప్రా విన్ ఫ్రే, క్రిస్టియానో రొనాల్డో, లెనిన్ హామిల్టన్ ల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పక్క అనుష్క మైనపు విగ్రహం చేరబోతుంది. అయితే అనుష్క మైనపు విగ్రహానికి ఓ ఫోన్ ఏర్పాటు చేస్తారట. అభిమానులు ఆ ఫోన్ పట్టుకుంటే.. అనుష్క మైనపు బొమ్మ వారితో మాట్లాడుతుందట.

ఇప్పటివరకు ఎందరో సెలబ్రిటీల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ అనుష్క విగ్రహం మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఈ మ్యూజియంకు వస్తోన్న చాలా మంది వీక్షకులు తమ అభిమాన తార అనుష్క శర్మ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులను కోరుతున్నారని మ్యూజియం మేనేజర్ తెలిపారు. మైనపు విగ్రహం కోసం అనుష్క శర్మతో కలిసి పని చేయబోతుండడం సంతోషంగా ఉందని అన్నారు.  
 

loader