క్రేజీ కపుల్స్ అనుష్క శర్మ, విరాట కోహ్లీ 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. పలు సందర్భాల్లో అనుష్క శర్మ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. విరాట్ కోహ్లీ విఫలమైన ప్రతి సారీ నెటిజన్లు అనుష్కని టార్గెట్ చేసేవారు. తాజాగా అనుష్క మరోసారి మీడియాపై మండిపడింది. ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను గర్భవతి అంటూ వస్తున్న వార్తలపై అనుష్క ఘాటుగా స్పందించింది. 

మీరు గర్భవతి అంటూ వార్తలు వస్తున్నాయి నిజమేనా అని ప్రశ్నించగా.. పెళ్ళైతే గర్భమేనా.. ఈ ప్రశ్నలు తప్ప అడగడానికి ఇంకేమి లేదా.. వ్యక్తిగత విషయాల గురించి ఇలాగేనా మాట్లాడేది అంటూ అనుష్క ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటివి జనాలకు ఆసక్తిగా ఉండొచ్చు. కానీ మాకు కూడా వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛ ఉంటాయి అని అనుష్క శర్మ తెలిపింది. 

ఆ నటి డేటింగ్ చేస్తోందట కదా.. పెళ్ళెప్పుడు.. పెళ్ళైతే గర్భవతా లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుందని అనుష్క తెలిపింది. ఇలాంటి వార్తలు విని సైలెంట్ గా ఉండడమే బెటర్ అని అనుష్క తెలిపింది. వదులుగా దుస్తులు వేసుకుంటే గర్భవతి అని తేల్చేస్తారా.. ట్రెండీగా డ్రెస్ వేసుకుంది అనువచ్చు కదా అని అనుష్క సమాధానం ఇచ్చింది.