'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో సినిమా ఓకే చేశాడు. దర్శకుడు రాధాకృష్ణతో కలిసి వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా మరో ముఖ్య పాత్రలో అనుష్క కనిపించనుందని సమాచారం.

ప్రభాస్-అనుష్క ల మధ్య నడిచే ఎపిసోడ్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. వీరిద్దరి మధ్య ఓ పాటను కూడా చిత్రీకరిస్తారని తెలుస్తోంది. బాహుబలి జంట మరోసారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. 

ఆ కారణంగానే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇప్పటికే ప్రభాస్, అనుష్క కలిసి 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' వంటి చిత్రాల్లో నటించారు. మరోసారి ఈ జంట వెండితెరపై కనిపించబోతుందంటే అభిమానుల సందడి మాములుగా ఉండదు!