Asianet News TeluguAsianet News Telugu

మీరు ఎంతిచ్చినా ఒప్పుకోను.... తేల్చేసిన అనుష్క!

అనుష్క నిర్ణయం వెనక ఉన్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. అలా ఓ స్టాండర్డ్స్ లో ముందుకు వెళ్తోంది కాబట్టే ఈ రోజు అనుష్క ఈ స్టేజీలో ఉందంటున్నారు. అనుష్క తీసుకున్న నిర్ణయం ..తాను వెబ్ సీరిస్ లలో నటించకూడదనే. ఓ ఇంటర్నేషనల్ స్టీమింగ్ సంస్ద..భారీ రెమ్యునేషన్ తో ఆమెను వెబ్ సీరిస్ నిమిత్తం ఎప్రోచ్ అయ్యింది. మల్టీ లింగ్వల్ వెబ్ సీరిస్ అది. అయితే మొహమాటం లేకుండా,ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఆమె నో చెప్పేసిందని సమాచారం.  
 

Anushka rejects web series proposal
Author
Hyderabad, First Published Aug 1, 2020, 1:21 PM IST

అనుష్క తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. అయితే అనుష్క నిర్ణయం వెనక ఉన్న ఆలోచనను అందరూ మెచ్చుకుంటున్నారు. అలా ఓ స్టాండర్డ్స్ లో ముందుకు వెళ్తోంది కాబట్టే ఈ రోజు అనుష్క ఈ స్టేజీలో ఉందంటున్నారు. అనుష్క తీసుకున్న నిర్ణయం.. తాను వెబ్ సీరిస్ లలో నటించకూడదనే. ఓ ఇంటర్నేషనల్ స్టీమింగ్ సంస్ద..భారీ రెమ్యునేషన్ తో ఆమెను వెబ్ సీరిస్ నిమిత్తం ఎప్రోచ్ అయ్యింది. మల్టీ లింగ్వల్ వెబ్ సీరిస్ అది. అయితే మొహమాటం లేకుండా,ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఆమె నో చెప్పేసిందని సమాచారం.  
 
కరోనా దెబ్బతో థియోటర్స్ మూతబడి..డిజిటల్ ప్లాట్ ఫామ్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలై... మంచి లాభాలను గడించాయి. దీంతో వెబ్ సిరీస్ లకు క్రేజ్ అమాంతం పెరగంది.స్టార్స్ సైతం వీటికి జైకొడుతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ యాక్టర్స్ వెబ్ సిరీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అదే కోవలో అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా... ఆమె తిరస్కరించినట్టు సమాచారం. అందుకు కారణం.. వెబ్ సీరిస్ లో ఓ సారి దిగి చేస్తే...ఇంక సినిమాల్లో తన డిమాండ్ తగ్గుతుందని భావించిందిట. మరోవైపు, తాను నటించిన చిత్రం 'నిశ్శబ్దం'ను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి ఆమె అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
 
నిశ్శబ్దం సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌రిగింది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో త్వరలో ఓటీటి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారని వినపడుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios