దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరైన అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే.. అనుష్క ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది.

కాలికి ఆకులతో మెట్టె పెట్టుకున్నట్లుగా ఉన్న ఆ ఫోటోకి క్యాప్షన్ అవసరం లేదని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఆమె పెళ్లికి రెడీ అవుతోందని అనుకున్నారు. అనుష్క పెట్టిన పోస్ట్ పై రకరకాలుగా స్పందించారు. ఆమె పుట్టినరోజు కానుకగా గుడ్ న్యూస్ చెబుతుందని ఎదురుచూశారు.

అయితే ఈ ఫోటోకి తన పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది అనుష్క. అసలు విషయంలోకి వస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ తన శరీర బరువు తగ్గించుకోవడం కోసం నార్వేలోని ఓ ప్రకృతి వైద్యశాలలో చేరింది. ఇక్కడ నాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా బరువు తగ్గిస్తారు.

దట్టమైన అడవుల్లో ఉండే ఈ వైద్యశాలలో ఖాళీ సమయాల్లో సరదాగా తిరుగుతూ ఉండగా.. ఆమె కాలికి తగిలిన తీగను ఫోటో తీసి పోస్ట్ చేసిందట. ఇది చూసిన అభిమానులు అనుష్క పెళ్లికి సిద్ధమని భావించారు. ఈ ఫోటోపై రకరకాల కథనాలు కూడా వెలువడ్డాయి!

సంబంధిత వార్త.. 

వైరల్ అవుతోన్న అనుష్క ఇన్స్టాగ్రామ్ ఫోటో..!