బాహుబలి సుందరి అనుష్క సినీ కెరీర్ సౌండ్ లేకుండా సాగిపోతోంది. అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో స్పెషల్ ప్రాజెక్టుల్లోనే నటిస్తోంది. సైలెన్స్ అనే ఒక ప్రయోగాత్మక సినిమాతో ప్రస్తుతం బిజిగా ఉన్న స్వీటీ రీసెంట్ గా ఒక బడా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   

అమితాబ్ బచ్చన్ - విక్రమ్ - ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖ తారలతో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న సినిమా ‘పొన్నియన్ సెల్వన్’. ఈ సినిమాలో అనుష్క కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క కంటే ముందు నయనతారను ఎంచుకున్నప్పటికీ ఆమె బిజీగా ఉండడంతో మణిరత్నం అనుష్కను సంప్రదించినట్లు సమాచారం. 

జయం రవి - విజయ్ సేతుపతి అలాగే కీర్తి సురేష్ కూడా ఈ బడా మల్టీస్టారర్ లో ప్రత్యేక పాత్రల్లో నటించనున్నారు. త్వరలోనే సినిమాకు సంబందించిన స్పెషల్ లుక్ ని విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.