'భాగమతి' సినిమా తరువాత ఇప్పటివరకు అనుష్క నుండి మరే సినిమా రాలేదు. 'సైజ్ జీరో' సినిమా కోసం ఆమె బరువు పెరగడం, ఆ బరువుని తగ్గించుకునే క్రమంలో ఆమె మరో సినిమా అంగీకరించలేదు.

రీసెంట్ గా ఆమె పుట్టినరోజు సందర్భంగా నిర్మాత కోన వెంకట్.. అనుష్కతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. మాధవన్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాను హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేయబోతున్నారు.

లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క గెటప్ కి సంబంధించిన ఫోటోని కోన వెంకట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ''మా సినిమాలోని అనుష్క లుక్ చూసి మేము చాలా ఎగ్జైట్ అయ్యాం. ఈరోజు వరకు ఆమెది ది బెస్ట్ లుక్ ఇదే. ఈ లుక్ నాకు బాగా నచ్చింది'' అంటూ కోన పోస్ట్ పెట్టాడు.