మహానటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో స్వీటీ బ్యూటీ అనుష్క శెట్టి కూడా కనిపించనుంది. నాగ్ అశ్వీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టు పాత్రలో సమంత కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, షాలినీ పాండే, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ కూడా ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


ఈ సినిమాలో సావిత్రికి సన్నిహితురాలు, సహ నటి భానుమతి పాత్ర కోసం అనుష్కను సంప్రదించినట్లు తెలిసింది. అయితే, ఈ పాత్రకు అనుష్క శెట్టి ఒప్పుకుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే, సినిమా ప్రారంభానికి ముందే చిత్ర యూనిట్ ఆమెను సంప్రదించారు. అయితే, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా చిత్రీకరించలేదు. త్వరలోనే అనుష్క కూడా షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలున్నాయి.


వైజయంతి మూవీస్‌ పతాకంపై రూపొందిస్తున్న ఈ సినిమా మార్చి 20న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. అశ్వినీదత్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.