నయనతార చేసిన పాత్రలో అనుష్క, రీమేక్ వర్కవుట్ అవుతుందా?
అనుష్క నయనతార పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఇంకా వెలువడాల్సి ఉంది. అనుష్క సినిమా చూసిందని, చాలా బాగా ఆమెకు నచ్చిందని అంటున్నారు. దాంతో ఆమెతో తమిళంలో తీసిన నిర్మాతలే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలంటే గుర్తొచ్చే అతి తక్కువమంది హీరోయిన్స్ లో అనుష్క, నయనతార ముందుంటారు.ముఖ్యంగా అనుష్కకు తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. అనేకమంది స్టార్ హీరోలతో ఆమె ఆడి పాడారు. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన పలు తెలుగుచిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అయితే ఆమె ఈ మధ్యన కాస్త స్పీడు తగ్గించారు. సినిమాలు వరస పెట్టి కమిట్ అవ్వటం లేదు. గత కొందకాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ఆమె నటించిన నిశ్శబ్దం రిలీజైంది. ఆ తర్వాత ఆమె కమిటన చిత్రం అఫీషియల్ గా ఏదీ ప్రకటన లేదు.
అయితే యూవి క్రియేషన్స్ బ్యనర్ లో జాతి రత్నాలు నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క కాంబినేషన్ ఓ ప్రాజెక్ట్ ఖరారు అయ్యిందన్నారు. అయితే ఇది ఇప్పటిదాకా పట్టాలు ఎక్కలేదు. అయితే తాజాగా ఆమె ఓ రీమేక్ కమిటైందని మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. తాజాగా నయనతార కీలక పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ‘నెట్రికన్’. ఇందులో నయనతార అంధురాలిగా నటించడం సినిమాపై అంచనాలను పెంచింది. ఇక నెట్రికన్ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తాజాగా విడుదల అయిన సంగతి అందరికి తెలిసిందే.
కళ్ళు లేని అమ్మాయి గా నయనతార నటించి అదరకొట్టింది. ఈ చిత్రం ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు లో కి రీమేక్ చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క నయనతార పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ ఇంకా వెలువడాల్సి ఉంది. అనుష్క సినిమా చూసిందని, చాలా బాగా ఆమెకు నచ్చిందని అంటున్నారు. దాంతో ఆమెతో తమిళంలో తీసిన నిర్మాతలే ప్లానింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఆల్రెడీ నయనతార వచ్చిన సినిమా మళ్లీ రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందా అనే సందేహం చాలా మందికి ఉంది. అంతేకాదు మొన్న నిశ్శబ్దంలో మూగ,చెవుడు ఉన్న పాత్రలో అనుష్క కనిపించింది. ఇప్పుడు అంధురాలి పాత్ర చేస్తే ..ఇక ఆమె అలాంటి పాత్రలే చేస్తుంది అని ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి అనుష్క ఏం నిర్ణయం తీసుకుంటుందో.