యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో  “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనుంది.  ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి క్యాస్టింగ్ పరంగా ఇవి మాత్రమే అధికారికంగా బయటకొచ్చిన వార్తలు. అయితే ఈ చిత్రంలోని ఇతర క్యాస్టింగ్ కు సంబంధించి పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అనుష్క ఈ సినిమాలో సీత గా కనిపించనుందని.  దాంతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా మొద‌లైపోయాయి.

 `బాహుబ‌లి`తో బాలీవుడ్ లోనూ అనుష్క గుర్తింపు తెచ్చుకుంది కాబ‌ట్టి, సీత పాత్రకు స్వీటీ ని ఎంచుకోవ‌డం దాదాపు ఖాయం అని  ఫిక్సైపోయారు మీడియా జనం. అయితే ఈ విష‌య‌మై అనుష్క తొలిసారి స్పందించింది. “ఆదిపురుష్ ప్రాజెక్టులో న‌టించ‌మ‌ని నన్నెవ‌రూ అడ‌గ‌లేదు. అలాంటి ప్రతిపాద‌న ఏదీ త‌న ద‌గ్గర‌కు రాలేద‌”ని క్లారిటీ ఇచ్చేసింది. తాను తెలుగులో రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకున్నాన‌ని, అందులో ఆదిపురుష్ లేద‌ని స్పష్టం చేసింది. 

మరో ప్రక్క సీత పాత్ర కోసం కైరా అద్వాణీ, కీర్తి సురేష్ లాంటి పేర్లూ ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. సౌత్ ఇండియ‌న్ హీరోయిన్స్ నే సీత పాత్ర కోసం ఎంచుకుంటార‌ని, బాలీవుడ్ భామ‌లెవ‌రూ ఆ పాత్రకు క‌రెక్ట్ కాద‌న్న అభిప్రాయం అభిమానుల్లో బ‌లంగా వినిపిస్తోంది.