Asianet News TeluguAsianet News Telugu

'జవాన్' స్పీడు తగ్గి 'శెట్టి' గారు పికప్ అవుతున్నారా?

 డిఫరెంట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చి సోలో లైఫ్‌ లీడ్ చేసే మిస్టర్‌ పొలిశెట్టి, మిస్‌ పొలిశెట్టి మధ్య సాగిన ఫన్నీ ట్రాక్‌ను ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Anushka film Miss Shetty Mr Polishetty box office picks pace jsp
Author
First Published Sep 13, 2023, 10:54 AM IST


నవీన్‌ పొలిశెట్టి, అనుష్కల  (Anushka) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty). సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అదే రోజు షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రం రిలీజ్ అవటం ఓపినింగ్స్  కు బాగా దెబ్బ కొట్టింది. అయితే మెల్లిమెల్లిగా జవాన్ తెలుగు వెర్షన్ హవా తగ్గుతోంది. దాంతో ఇక్కడ కూడా బాగానే పికప్ అవుతోంది.   నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టే దిసగా నడుస్తోంది.  
 
అలాగే  యుఎస్‌లో తొలి వీకెండ్లోనే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మిలియన్ డాలర్ వసూళ్లు రాబట్టడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు వీకెండ్ లో మంచి కలెక్షన్లు వచ్చాయి. సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుకు చేరువగా వచ్చిందంటున్నారు. దాంతో ఈ వారం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది. వీకెండ్ తర్వాత ‘జవాన్’ తెలుగు వెర్షన్ జోరు బాగా తగ్గటం, ఈ వారం రావాల్సిన ‘స్కంద’; ‘చంద్రముఖి-2’ వాయిదా పడపడటం ప్లస్ అవుతున్నాయి.

దానికి తోడు భాక్సాఫీస్ దగ్గర ‘మార్క్ ఆంటోనీ’కే కొద్దో గొప్పో బజ్ ఉంది. ‘చాంగురే బంగారు రాజా’కు అసలు ఎక్సపెక్టేషన్స్  లేవు. ఈ క్రమంలో అన్ని బాగుంటే వినాయకచవితి సీజన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’కి బాగా కలిసి వచ్చేలా ఉందని ట్రేడ్ లో అంచనా వేస్తున్నాయి.  ఇదే జరిగిగే  ఫుల్ రన్లో ఈ సినిమా హిట్ రేంజికి చేరుతుంది.

మరో ప్రక్క సెలబ్రెటీలు సైతం ఈ సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు మెగాస్టార్‌ చిరంజీవి, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తోపాటు పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు. తాజాగా చెన్నై సుందరి సమంత (Samantha)ఈ సినిమాపై తన రియాక్షన్‌ను తెలియజేసింది. నేను చాలా కాలంగా నవ్వలేదు. సూపర్‌గా నవ్వించిన రత్నం లాంటి నవీన్‌ పొలిశెట్టికి ధన్యవాదాలు. ఛామింగ్‌ అనుష్కాతోపాటు చిత్రయూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు అంటూ విషెస్‌ తెలియజేసింది సమంత.  నవీన్ పొలిశెట్టి. మహేశ్ బాబు పీ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రానికి చిరంజీవి తొలి ప్రేక్షకుడిగా సూపర్ రివ్యూ కూడా ఇచ్చాడు.  ఈ క్రమంలో మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టికి బ్లాక్ బస్టర్ టాక్‌ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ.. ఇప్పటికే ఓ వీడియోను షేర్ చేశాడు

Follow Us:
Download App:
  • android
  • ios