టాలీవుడ్ స్వీటీ అనుష్కా బాగమతి తరువాత ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. సైరా సినిమాలో ఆమె ఒక ముఖ్య పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె పాత్రపై మొన్నటివరకు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే లేటస్ట్ గా అందిన సమాచారం ప్రకారం ఆమె ఫ్రీడమ్ ఫైటర్ రోల్ లో కనిపించబోతోందట. 

వీరనారి లక్ష్మి భాయిగా అనుష్క తెరపై అతిధి పాత్రలో మెరవనుందని టాక్ వస్తోంది. ఉయ్యాలవాడ సరసింహారెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ ఇటీవల ముగిసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే అనుష్క మెగాస్టార్ తో కలిసి పలు యుద్ధ సన్నివేశాల్లో నటించినట్లు ఇన్ సైడ్ టాక్. 

అంటే లక్ష్మి భాయ్ - ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలను కల్పితంగా దగ్గర చేసి దర్శకుడు సురేందర్ రెడ్డి తనదైన శైలిలో ఎమోషన్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ - నయనతార - సుదీప్ - విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.