బాక్సాఫీస్ వద్ద అనుష్క భాగమతి భగభగలు

బాక్సాఫీస్ వద్ద అనుష్క భాగమతి భగభగలు

అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి చిత్రం రిపబ్లిక్ డేను పురస్కరించుకొని రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వసూళ్లు దుమ్మురేపుతున్నాయి. యూవీ క్రియేషన్స్ రూపొందించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోందని.. నిర్మాతలు, డిస్టిబ్యూటర్ దిల్ రాజు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భాగమతి చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 1200 స్క్రీన్లలో రిలీజైంది. సెలవు దినం కావడంతో అడ్వాన్స్ బుకింగ్ రూపంలో తొలి రోజునే భారీ కలెక్షన్లను సాధించింది. వారాంతం తర్వాత కూడా సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటికిపైగా వసూళ్లను సాధించిందని దిల్ రాజు వెల్లడించారు.

 

తొలి వారంతంలో తెలుగు, తమిళం, మలయాళం మూడు భాషల్లో కలిపి భాగమతి రూ.28.75 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో రూ.7.65 కోట్లు సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే 36 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయడం అనుష్క స్టామినాకు అద్దం పట్టింది. సాధారణంగా మూడు రోజుల తర్వాత కలెక్షన్లు కొంత మేరకు తగ్గుముఖం పడుతాయి. కానీ భాగమతి చిత్రం వసూళ్లు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ మార్కెట్‌లో సోమవారం కూడా భారీగా నమోదు చేసిందని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

 

అమెరికాలో ఈ చిత్రం రెండు రోజుల్లోనే హాఫ్ మిలియన్ డాలర్లను వసూలు చేసింది. గురువారం నాటి ప్రీమియర్ షో 250కే డాలర్లు, శుక్రవారం 275కే డాలర్లు వసూలు చేయడం గమనార్హం. భాగమతి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. తొలివారం ముగిసే సరికి రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది అని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. భాగమతి చిత్రం సుమారు రూ.30 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. తెలుగు థియేట్రికల్ హక్కుల రూపంలో రూ.20 కోట్లు సమకూరినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మించినో యూవీ క్రియేషన్ స్వయంగా పంపిణీ చేసింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page