ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తెని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో బెదిరింపు పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో ఆయన ప్రధాని మోదీ సాయం కోరారు. వివరాల్లోకి వెళితే.. అనురాగ్ కశ్యప్.. మోదీకి వ్యతిరేకి అంటూ అతడి కూతురిని కొందరు మోదీ అనుచరులు టార్గెట్ చేశారు.

ఆమె జీవితాన్ని నాశనం చేస్తామంటూ బెదిరింపులకుపాల్పడుతున్నారు. 'చౌకీదార్ రామ్ సంఘి' అనే ట్విట్టర్ ఖాతాలో అనురాగ్ కుమార్తె ఫోటోను షేర్ చేస్తూ.. ''మీ నాన్నకు చెప్పు.. మరోసారి మోదీకీ వ్యతిరేకంగా మాట్లాడితే నీ ముఖాన్ని మరెవరూ చూడకుండా చేస్తామని'' బెదిరించారు.

ఈ ట్వీట్ చూసిన అనురాగ్.. మోదీని ట్యాగ్ చేస్తూ.. ''డియర్ నరేంద్రమోదీ సర్.. మీరు ఎన్నికల్లో విజయం సాధించినందుకు కంగ్రాట్స్  సర్.. మీ అనుచరులు అని చెప్పుకొంటూ కొందరు నా కుమార్తెని బెదిరిస్తున్నారు. నేను మీకు వ్యతిరేకినని నా కుమార్తెను టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటివారిని ఎలా ఎదుర్కోవాలో చెప్పండి ప్లీజ్'' అంటూ రాసుకొచ్చారు.

ఇది చూసిన ఇండియన్‌ ఫిలిం అండ్‌ టీవీ డైరెక్టర్స్‌ అసోసియేషన్ సభ్యుడు అశోక్ పండిట్.. అది ఫేక్ అకౌంట్ అని మోదీకి ట్వీట్ చేయడం కంటే పోలీసులను సంప్రదిస్తే ఫలితం ఉంటుందని స్పందించాడు. ఇది చూసిన అనురాగ్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తన కూతురు జీవితమని జోక్కాదని ఫైర్ అయ్యాడు.