మీడియాలో ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయకపోతే సినిమాలకు ప్రమోషన్ రావటం లేదు. ఇది చాలా మంది సెలబ్రెటీలు గమనించి అమలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాసెస్ లో ఒక్కోసారి హద్దు మీరుతున్నారు. వివాదం కాస్తా జనాలకు విరక్తి గా మారుతోంది. ప్రస్తుతం తాప్సీ అలాంటి చిత్రమైన వివాదానికి ఆజ్యం పోసింది.
బాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కువగా ఉంటోంది. రీసెంట్ గా శభాష్ మిథు అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆమె .ఆ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయినా తగ్గేదేలే అంటూ మరో సక్సెస్ కోసం పట్టుదలగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం తాప్సీ నటించిన దోబారా చిత్రం ఆగస్టు 19 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన తాప్సీ.. అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకొంది.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ పన్ను పై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ వల్గర్ కామెంట్స్ చేయడం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ “ఇటీవల రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ గురించి మీ అభిప్రాయం ఏంటీ..?” అని అడిగారు. అందుకు అనురాగ్ కశ్యప్ సమాధానం చెప్తూ “నిజంగా చెప్పాలంటే బాలీవుడ్ లో ఇవన్నీ సర్వసాధారణం” అని అన్నాడు. దీంతో యాంకర్ మీరు కూడా అలా ట్రై చేయొచ్చుగా అని అడిగాడు. వెంటనే తాప్సీ పన్ను నవ్వుతూ.. హర్రర్ ఫిలిం చూపిస్తారా..? ఏంటి అని చెప్పుకొచ్చింది.
వెంటనే అనురాగ్ తాప్సీ కంటే నావి బిగ్గర్ b**bs అని అసూయ.. అందుకే వద్దంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఊహించని సమాధానానికి యాంకర్ షాక్ అయ్యి ఓకే ఓకే అని నెక్స్ట్ ప్రశ్నకు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రెమ్యూనిరేషన్, సినిమాల విషయంలో పురుషాధిక్యత అని మాట్లాడే తాప్సీ తన ఎదురుగా ఇలాంటి కామెంట్ చేస్తున్నప్పుడు.. ఎందుకు నోరు మెదపకుండా ఉంది. అలాంటి మాటలకుధీటుగా సమాధానము చెప్పాలి కదా అని నెట్ జనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'దోబారా' సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. తాప్సీతో ఆయనకు మూడో చిత్రమిది. ఇంతకు ముందు 'మన్మర్జియాన్', 'సాండ్ కి ఆంఖ్' సినిమాలు తీశారు. ఈ చిత్రంలో తాప్సీ పన్ను పూర్తిగా కొత్త అవతార్‌లో కనిపించనుండగా, ప్రేక్షకులు రెండు విభిన్న రూపాల్లో ఆమె నటనను ఆస్వాదిస్తారు. అనురాగ్ కశ్యప్ యొక్క దోబారా సినిమా భారతీయ ప్రేక్షకులు తెరపై ఎదుర్కోబోతున్న 'టైమ్ ట్రావెల్' కథలో ఒకటి. తాప్సీ పన్ను అనేక రహస్యాల ప్రపంచంలో చిక్కుకున్న పాత్రలో కనిపిస్తుండగా, ప్రేక్షకులు ఆమె రెండు విభిన్న ప్రపంచాల చుట్టూ గారడీ చేయడం చూస్తారు.
ద్విపాత్రాభినయం చేసే వ్యక్తిత్వాన్ని అన్వేషించకుండా విభిన్న రూపాల్లో ఆమె గతంలో, వర్తమానంలో ఉన్న భ్రమలను ఈ చిత్రం తెలివిగా సంగ్రహిస్తుంది. తాప్సీ చుట్టూ ఉన్న రహస్యాలకు సమాధానాలు వెతకడంలో తాప్సీ పోరాటం వుంటుంది. ఈ చిత్రానికి ప్రఖ్యాత దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. బాలాజీ టెలిఫిల్మ్స్, సునీర్ ఖేటర్‌పాల్, గౌరవ్ బోస్ (ఎథీనా) ఆధ్వర్యంలోని కొత్త వింగ్ అయిన శోభా కపూర్ అండ్ ఏక్తా ఆర్ కపూర్‌ల కల్ట్ మూవీస్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
