చూస్తూంటే బయోపిక్ సీజన్ ఇప్పుడిప్పుడే ముగిసేటట్లు కనపడటం లేదు. ఎలక్షన్స్ పేరు చెప్పి ప్రముఖుల బయోపిక్ లు అన్నీ తెరకెక్కించేసారు. అయినా సరే ఆ మోజు తీరినట్లు లేదు. ఎలక్షన్సో గెలిచిన వారి బయోపిక్ లు సైతం జనాలకు ఇంట్రస్ట్ గా ఉండే అవకాసం ఉందని వాటి పైనా దృష్టి పెడుతున్నారు ప్రముఖ దర్శకులు. ఇప్పుడు అదే కోవలం వైయస్ జగన్ బయోపిక్ సైతం తెరకెక్కనుందని సమాచారం.
 
వివరాల్లోకి వెళితే...ఎలక్షన్స్ లో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ పై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. జగన్ జీవితం తెరకెక్కిస్తే ఓ అద్భుతమైన చిత్రం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

మొన్నటి ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ ప్రభంజనం చూసి డీపీ సతీష్ అనే పాత్రికేయుడు న్యూస్18 మీడియా సంస్థ కోసం జగన్ పై ఓ కథనం రాశారు.  'సోనియా అవమానం, రెడ్డి ప్రతీకారం, ఆంధ్రా శాపం: కాల్పనికతను మించిన ఇతివృత్తం జగన్ ప్రస్థానం' పేరిట రాసిన ఆ కథనం నేషనల్ మీడియాలో సంచలనం అయింది. దీన్ని ప్రియా రమణి అనే మహిళా జర్నలిస్టు ట్వీట్ చేయగా అనురాగ్ కశ్యప్ స్పందించారు. తిరుగులేని కథాంశంతో ఈ చిత్రం త్వరలోనే పట్టాలు ఎక్కొచ్చంటూ రీట్వీట్ చేశారు.  మరి ఈ బయోపిక్ తీయటానికి  జగన్ ఫర్మిషన్ ఇస్తే త్వరలోనే తెరకెక్చచ్చు.