నిర్మాతలను అనుపమ ఇబ్బంది పెడుతోందా?

anupama parameshwaran troubling producers
Highlights

'అ ఆ' సినిమాలో నాగవల్లి పాత్రతో తెలుగు వారికి దగ్గరైంది అనుపమ పరమేశ్వరన్

'అ ఆ' సినిమాలో నాగవల్లి పాత్రతో తెలుగు వారికి దగ్గరైంది అనుపమ పరమేశ్వరన్. తక్కువ సమయంలోనే నటిగా చక్కటి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం 'తేజ్ ఐ లవ్ యు','హలో గురు ప్రేమకోసమే' వంటి చిత్రాల్లో నటిస్తోన్న ఈ భామ నిర్మాతలను ఇబ్బంది పెడుతోందని టాక్. రామ్ తో కలిసి నటిస్తోన్న 'హలో గురు ప్రేమకోసమే' సినిమాను నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొదలైన సమయంలోనే అనుపమ తనకంటూ స్పెషల్ గా ఒక క్యారవాన్ ఇవ్వమని నిర్మాతలను అడిగిందట. సాధారణంగా సింగిల్ డోర్ క్యారవాన్ ను హీరోలకు మాత్రమే కేటాయిస్తారు. ఇక మిగిలిన వారందరికీ డబుల్ డోర్ క్యారవాన్ లు ఇస్తారు. అంటే ఒక క్యారవాన్ లో ఉన్న రెండు గదులను ఇద్దరు నటులకు ఇస్తారన్నమాట. అయితే అనుపమ తనకు సింగిల్ డోర్ క్యారవాన్ కావాలని అడిగితే నిర్మాతలు స్పందించలేదట.

ఈ విషయంలో ఆమె పెర్సనల్ స్టాఫ్ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. వారిపై కూడా ఫైర్ అయిందట ఈ బ్యూటీ. ఇది చాలదు అన్నట్లు.. యూనిట్ వాళ్లు ఇచ్చే కాస్ట్యూమర్ వద్దని.. తన పెర్సనల్ కాస్ట్యూమర్ కావాలని పట్టుబట్టిందట. కెరీర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో అనుపమ ఇలా తన ప్రవర్తనతో ఇతరులను ఇబ్బంది పెట్టడం సరికాదని, ఇది ఆమె కెరీర్ కు మైనస్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


 

loader