తెలుగులో ముచ్చటగా మూడు సినిమాలతో క్రేజ్ సంపాదించిన అనుపమ రీసెంట్ గా శతమానంభవతి సినిమాతో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన కేరళ భామ రామ్ చరణ్ సరసన ఆఫర్ కొట్టెేసిన అనుపమ పరమేశ్వరన్ అంతలోనే ఏం జరిగిందో కానీ రామ్ చరణ్ సుకుమార్ మూవీలోంచి అనుపమ అవుట్

ధృవ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు. ధృవ’లో ధృడంగా, క్లీన్‌ షేవ్‌తో కనిపించిన చెర్రీ ఇప్పుడు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. అన్ని ఈవెంట్లలోనూ గడ్డంతో కనిపిస్తున్నాడేంటబ్బా అని ఆరా తీస్తే, అసలు విషయం తెలిసింది. దర్శకుడు సుకుమార్‌ వెయిట్‌ తగ్గి, గడ్డం పెంచమని చరణ్‌ కు సూచించాడట! ఆయన కోరిక మేరకు రామ్‌చరణ్‌ గడ్డం పెంచుతున్నాడు.. బరువు కూడా తగ్గుతున్నారు. తగ్గడం కోసం ఫుడ్‌ హ్యాబిట్స్‌ని కొంచెం మార్చుకున్నారట. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించనుంది. ఈ సినిమాలోనే చరణ్‌ ఈ కొత్త లుక్‌లో కనువిందు చేయనున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్‌ చేయనున్నారు.

ఇక ఇప్ఆపటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో దర్శకుడు సుకుమార్, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు సినిమా లొకేషన్లు ఫైనలైజ్‌ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా తొలుత అనుపమా పరమేశ్వరన్‌ని ఎంపిక చేశారు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు మూడు సినిమాలతో దగ్గరైన అనుపమ రామ్ చరణ్ సరసన మూవీ సైన్ చేసి మెగా క్యాంపులో పాగా వేసిందని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ఏమైందో ఏమో కానీ అనుపమకు ఆ ఛాన్స్ దక్కినట్టే దక్కి మళ్లీ దూరమైంది. మరి ఏ కారణంగా అనుపమను తప్పించారో తెలియాల్సి ఉంది.

అయితే... రామ్ చరణ్ సరసన అనుపమ చాలా చిన్న వయస్కురాలిగా కనిపిస్తోందిని టీమ్ అభిప్రాయపడిందట. పైగా హీరోయిన్ టాప్ రేంజ్ హీరోయిన్ అయితే చరణ్, సుకుమార్ లతోపాటు హీరోయిన్ కాంబినేషన్ కూడా టాప్ రేంజ్ లో ఉంటుందని భావిస్తున్నారట. మొత్తానికి మూడు సినిమాలు వరుసగా హిట్ కొట్టినా... అనుపమ పేరు అధికారికంగా ప్రకటించాక ఇలాంటి వార్త రావడం కాస్త జీర్ణం కానిదే.