బాలీవుడ్ ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్.టి.ఐ.ఐ)కి చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఆయన తన పదవికి రిజైన్ చేస్తూ రాజీనామా పత్రాన్ని అధికారులకి అందించాడు.

తొమ్మిది నెలల పాటు అమెరికా వెళ్లాల్సి రావడంతో ఆయన తన పదవిని వదులుకున్నట్లు తెలుస్తోంది. 2017 అక్టోబర్ నెలలో అనుపమ్ ఖేర్ ఎఫ్.టి.ఐ.ఐ కి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

గజెంద్రన్ చౌహాన్ అనే వ్యక్తి కారణంగా వివాదాలు జరగడంతో ఆయన స్థానాన్ని అనుపమ్ ఖేర్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన తన పదవికి స్వస్తి చెప్పారు. అధికారులు ఆయన రాజీనామా లెటర్ ని యాక్సెప్ట్ చేశారు.

ప్రస్తుతం అనుపమ్ ఖేర్ 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే సినిమాలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం.