ఇవన్నీ కూడా ఆఫీస్ బయటున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందట. ఈ విషయమైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించారట. 


బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ ని తెలిసియని వాళ్లు ఉండరు. ఆయన ముంబై ఆఫీస్ లో దొంగలు పడ్డారు. తాళాలు బ్రద్దలు కొట్టి లోపలలికి వెళ్లి దొంగతనం చేసారు. ఈ మేరకు అనుపర్ ఖేర్ వదిలిన వీడియో వైరల్ అవుతోంది. తన ఆఫీస్‌లో దొంగలు పడ్డారని, ఇలా డోర్ విరగ్గొట్టారంటూ చెబుతూ వదిలిన వీడియో చేసారు. అయితే దొంగలు డబ్బులు జోలికి పోలీదు. ఖరీదైన ఫర్నిటర్ ఎత్తుకెళ్లలేదు. కేవలం ఆఫీస్‌లోంచి ఆ దొంగలు ఓ సినిమా నెగెటివ్‌ని ఎత్తుకెళ్లారు. అదీ ఖేర్ కంపెనీ నిర్మించిన చిత్రం సినిమా నెగిటివ్. అయితే ఏ సినిమా అనేది ఆయన చెప్పలేదు. 

ఇవన్నీ కూడా ఆఫీస్ బయటున్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిందట. ఈ విషయమైన పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించారట. త్వరలోనే ఆ దొంగల్ని పట్టుకుంటామని, ఆటో నంబర్ కూడా ఉందని అన్నారట. ఆ దొంగలకు దేవుడే తెలివిని ప్రాప్తించాలని అనుపమ్ ఖేర్ పోస్ట్ వేశారు.

View post on Instagram

40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher). 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారాయన. హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఇంగ్లిష్‌, చైనీస్‌ చిత్రాల్లోనూ ఆయన నటించారు. 1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. చాలాకాలం తర్వాత తెలుగులో ‘కార్తికేయ 2’ (Karthikeya 2), ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాల్లో కీలక పాత్రలు పోషించి అలరించారు.