Asianet News TeluguAsianet News Telugu

'యాపిల్'ని ఏకిపారేసిన నటుడు.. డబ్బు మనది.. గౌరవం వాళ్లకు మాత్రమే

ఇండియాలో ఏ విదేశీ సంస్థకైనా అద్భుతమైన ఆదరణ ఉంటుంది. బడ్జెట్ లో దొరికే ప్రొడక్ట్స్ నుంచి ఖరీదైన ప్రొడక్ట్స్ వరకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. 

Anupam Kher is disappointed after visiting an Apple store in US
Author
Hyderabad, First Published Sep 17, 2021, 11:24 AM IST

ఇండియాలో ఏ విదేశీ సంస్థకైనా అద్భుతమైన ఆదరణ ఉంటుంది. బడ్జెట్ లో దొరికే ప్రొడక్ట్స్ నుంచి ఖరీదైన ప్రొడక్ట్స్ వరకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. ఇక యాపిల్ సంస్థ నుంచి వచ్చే మొబైల్స్, వాచ్ లకు ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

ఐఫోన్ అమ్మకాల్లో యాపిల్ సంస్థ ఇండియా నుంచి అత్యధిక ఆదాయం గడిస్తోంది. కానీ ఇండియా అంటే యాపిల్ లాంటి సంస్థలు ఎప్పుడూ అలసత్వం ప్రదర్శిస్తూనే ఉంటాయి. తాజాగా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. భారత్ అంటే లెక్కలేనితనంతో ఉన్న యాపిల్ సంస్థని ఏకిపారేశారు. 

ప్రస్తుతం అనుపమ్ ఖేర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్ లోని ఫిఫ్త్ ఎవెన్యూ లోని యాపిల్ స్టోర్ ని ఆయన సందర్శించారు. అక్కడ యాపిల్ సంస్థ ఒలింపిక్ కలెక్షన్స్ పేరుతో స్మార్ట్ వాచీలని ప్రదర్శనకు ఉంచింది. 

ఆ వాచీలని వివిధ దేశాల జాతీయ జెండాలతో డిజైన్ చేశారు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనెడా, జమైకా లాంటి దేశాల జెండాలు కనిపించాయి. కానీ యాపిల్ సంస్థ అత్యధిక ఆదాయం పొందే ఇండియన్ ఫ్లాగ్ మాత్రమే లేదు. దీనితో అనుపమ్ ఖేర్ తీవ్ర నిరాశకు గురయ్యారు. 

యాపిల్ కు కస్టమర్లు ఇండియాలోనే కదా ఎక్కువగా ఉన్నారు.. మరి మన దేశ జెండా ఇక్కడ లేదు ఏంటి అని అనుపమ్ వీడియో పోస్ట్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios