పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి ఈ మూవీలో హిరోయిన్ గా నటిస్తున్న అను ఎమ్మాన్యుయెల్ తొలిరోజు పవన్ సార్ ను చూసి నోట మాట రాలేదంటున్న అను ఎమ్మాన్యుయెల్

మళయాల భామ అను ఎమాన్యుయెల్ మాతృభాషలో కెరీర్ స్టాట్ చేసినా... ఇప్పుడు టాలీవుడ్ లో కెరీర్ నిలుపుకోవాలని ప్లాన్ చేస్తోంది. నానీ హీరోగా నటించిన మజ్ఞూ సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మాయి అనూహ్యంగా పవర్ స్టార్ లాంటి అగ్రహీరో సినిమాలో కూడా బుక్ అయ్యింది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో అవకాశం దక్కటం అంటే మామూలు విషయం కాదు.

పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి పని చేయటం అనగానే కాస్త భయపడిందట, అంతే కాదు మొదటిరోజు బాగా ప్రిపేరై వెళ్లానని... కానీ ఆయన్ను చూడగానే అన్నీ మర్చిపోయానని పవన్ తో తన తొలిరోజు షూటింగ్ అనుభవాన్ని గుర్తు చేసుకుని చెప్పింది.

ముందు ఈ సినిమా యూనిట్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు... పవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలనగానే.. ఆల్రెడీ కీర్తీ సురేష్ హీరోయిన్ కాబట్టి తనకి చెల్లెలి పాత్ర ఆఫర్ చేస్తున్నారేమో అనుకుందట. ముందు తటపటాయించినా తర్వాత హీరోయిన్ పాత్ర కావడంతో ఎగిరి గంతేసి ఒప్పుకుందట.

పాపం మళయాళీ పిల్లనే అయిన "ప్రేమిస్తే" సంధ్య ఈ మాత్రం ఆలోచించలేకే పవన్ పక్కన "అన్నవరం" లో చెల్లెలిగా కనిపించి తన కెరీర్ కి తానే హీరోయిన్ గా మంగళం పాడేసుకుంది. ఈ విషయం అనూకి ఎవరన్నా చెప్పారో లేదో గాని మొత్తానికి పవన్ కి చెల్లెలి పాత్ర అయితే ఒప్పుకునేదాన్ని కాదని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది. మొత్తానికి త్రివిక్రమ్ గారు నన్ను హీరోయిన్‌గా ఎంచుకుని ఆశ్చర్యపరిచారు. చాలా మంచి పాత్ర ఇది. చాలామంది హీరోయిన్లను పరిశీలించి చివరికి నన్ను ఈ పాత్రకు ఎంచుకున్నట్లు చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు సంబంధించి తొలి రోజు నాకు, పవన్ సార్‌కు మధ్య రొమాంటిక్ సీన్ తీశారు. మూడుసార్లు డైలాగులు చదువుకుని సెట్‌కు వెళ్లినా.. ఆయన ఎదురు పడగానే డైలాగులు గుర్తుకు రాలేదు. అన్నీ మరిచిపోయాను. ఐతే పవన్ సారు సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ నాలో భయం పోగొట్టారు’’ అని చెప్పింది అను.