ప్రేమమ్ సినిమాతో అను ఇమ్మాన్యుయేల్ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా బిజీ అయ్యింది మాత్రం తెలుగులోనే. ఆ సినిమా సక్సెస్ తర్వాత సాయి పల్లవిలాగే ఆమెకూడా ఇక్కడ వరస ఆఫర్స్ తెచ్చుకుంది. ఆమెది ఎంత లక్ అంటే..కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్ సరసన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ఆ సినిమా ఆడలేదు.

ఆ తర్వాత ఆమె గోపీచంద్ సరసన నటించిన ఆక్సిజన్,  అల్లు అర్జున్ తో చేసిన నా పేరు సూర్య,   నాగచైతన్య అక్కినేని సరసన చేసిన శైలజారెడ్డి అల్లుడు ..ఇలా ఏ  చిత్రామూ ఆడలేదు. దాంతో ఆమె కెరీర్ అయోమయంలో పడింది.  ఎంత అందం ఉన్నా, నటన ఉన్నా సక్సెస్ లేకపోవటంతో ఆమె పూర్తిగా వెనకపడింది. 

దాంతో ఒకానొక టైమ్ లో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆమె తిరిగిన తన సక్సెస్ కాకపోవటానికి కారణాలను అన్వేషించింది. అందులో మొదటగా కనపడింది...స్టార్స్ ఉన్నా..అందుకు తగిన స్క్రిప్ట్ లేకపోవటమే అని గ్రహించింది. దాంతో తన దగ్గరకు వస్తున్న నిర్మాతలతో బౌండెడ్ స్క్రిప్టు కండీషన్ పెడుతోందిట. అయితే ఎంత బౌండెడ్ స్క్రిప్టు తెచ్చినా స్క్రిప్టులో విషయం లేకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు. పవన్ కు తెలియదా, అల్లు అర్జున్ కు అర్దం కాదా..నాగచైతన్య కు నాలెడ్జ్ లేదా స్క్రిప్టు మీద....అయినా ప్రేక్షకుడు పల్స్ పట్టుకోవటంతో ఇవన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. 

కాబట్టి అను తన దగ్గరకు వచ్చిన స్క్రిప్టులు స్కానింగ్ పెట్టే కార్యక్రమం పెట్టుకుంటే ఇంక నిర్మాతలు ఎవరూ రారు అంటున్నారు. హిట్ లో ఉన్న హీరోయిన్ ని ఒప్పించటానికి దర్శక,నిర్మాతలు ఉత్సాహం చూపిస్తారు కానీ..ప్లాఫ్ లో ఉన్న పాపని పడగొట్టాల్సిన పనేంటని నిర్మాతలు నవ్వేస్తున్నారు ఈ కండీషన్ విని. కాబట్టి కాస్త ఆలోచించి దగ్గర దాకా వచ్చిన ఆఫర్స్ చెడ కొట్టుకోవద్దు అని సలహా ఇస్తున్నారు. అదీ నిజమే.