సమంతాపై చైతు హీరోయిన్ కామెంట్స్!

anu emmanuel comments on samantha
Highlights

ఫ్యాషన్ పరంగా నా చిన్నప్పుడు మాధురి దీక్షిత్, శ్రీదేవిలను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. వాళ్లను ఎప్పుడు చూసిన కొత్తగానే కనిపించేవారు. అలా ఈ మధ్య కాలంలో సమంతాను చూసి ఇంప్రెస్ అయ్యాను. ఫ్యాషన్ పరంగా అందరికంటే కాస్త ముందు ఉండాలని అనుకుంటాను. 

'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అను ఎమ్మాన్యుయల్ అతి తక్కువ సమయంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి తారలతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం ఆమె నటిస్తోన్న 'శైలజా రెడ్డి' అల్లుడు సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది.

ఈ మూవీ షూటింగ్ లో బిజీగా గడుపుతోన్న అను ఎమ్మాన్యుయల్ ఫ్యాషన్ రంగంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఫ్యాషన్ పరంగా నా చిన్నప్పుడు మాధురి దీక్షిత్, శ్రీదేవిలను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. వాళ్లను ఎప్పుడు చూసిన కొత్తగానే కనిపించేవారు. అలా ఈ మధ్య కాలంలో సమంతాను చూసి ఇంప్రెస్ అయ్యాను. ఫ్యాషన్ పరంగా అందరికంటే కాస్త ముందు ఉండాలని అనుకుంటాను. అందుకే నా ఫోన్ లో పిన్ ట్రెస్ట్ అనే యాప్ పెట్టుకున్నాను.

తిండి నుండి బట్ట వరకు ప్రతీది అందులో ఉంటుంది. నాకు సమయం దొరికినప్పుడల్లా ఆ యాప్ ను ఓపెన్ చేసి చూస్తూ ఉంటా. దానికి కారణంగా నాకు చాలా ఆలోచనలు వస్తుంటాయి'' అని చెప్పుకొచ్చింది ఈ ఎన్నారై బ్యూటీ. చైతుతో సినిమాలో నటిస్తూ ఫ్యాషన్ పరంగా తన భార్యను పొగడడంతో ఏదో మర్మమే దాగి ఉందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 

loader