Asianet News TeluguAsianet News Telugu

'అంతరిక్షం' కొత్త ప్రొమో... రివ్యూ రైటర్స్ కే

సినిమా రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శక,నిర్మాతలు. రేపు రిలీజ్ కాబోతున్న శర్వానంద్ ..పడి పడి లేచే మనసు విషయంలో ఇప్పటికే రివ్యూలు బాగా రావాలంటూ శర్వానంద్ ఇంటర్వూలో చెప్పారు.

Anthariksham team's dig at mass reviewers
Author
Hyderabad, First Published Dec 20, 2018, 4:40 PM IST

సినిమా రిలీజ్ తర్వాత వచ్చే రివ్యూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు దర్శక,నిర్మాతలు. రేపు రిలీజ్ కాబోతున్న శర్వానంద్ ..పడి పడి లేచే మనసు విషయంలో ఇప్పటికే రివ్యూలు బాగా రావాలంటూ శర్వానంద్ ఇంటర్వూలో చెప్పారు. ఇక ఇప్పుడు అంతరిక్షం వంతు వచ్చింది. వాళ్లు ఏకంగా రివ్యూ రైటర్స్ ని టార్గెట్ చేస్తూ ఓ వీడియోని వదిలారు.

వివరాల్లోకి వెళితే...'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్, అతిథి రావు హైదరి, లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం అంతరిక్షం. ఈ చిత్రం  రేపే(శుక్రవారం) ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి  స్పందన కనిపించగా తాజాగా మేకర్స్ మాస్ అమ్మా మాస్ అనే మరో ప్రోమోను విడుదల చేశారు. 

భారత్‌లో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇదే అని చెబుతూ, రివ్యూ రైటర్స్ తమ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ వెతకద్దు అంటూ రూపొందించిన ఈ ప్రోమో వైరల్ అవుతోంది. సాధారణంగా కమర్షియల్ సినిమాలకు కొలమానంగా నిలిచే మాస్ ప్రేక్షకులు కోరుకునే అంశాలు ఇందులో ఉన్నాయా లేదా అని చెక్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇండియన్ మాస్ కౌన్సిల్ నుంచి ఒక ప్రతినిధి రావటంతో ప్రోమో ప్రారంభమవుతుంది. 

వరుణ్ తేజ్ ను ఇంటర్వ్యూ చేస్తూ ఇందులో హీరోయిజం ఎలివేషన్ గ్రావిటీ మాస్ ఎలెమెంట్స్ లాంటివన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాడు. ఈ వీడియో అంతరిక్షం మూవీపై మరిన్ని అంచనాలను పెంచింది. గంటకు 9000 కిమీ అనే ట్యాగ్ లైన్ సైతం సినిమాపై ఇంకొంత క్యూరియాసిని పెంచింది. 

తన మొదటి సినిమా ఘాజీని సముద్ర గర్భంలో యుద్ధం నేపథ్యంతో తెరకెక్కించిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి, తన రెండో సినిమా 'అంతరిక్షం'ను అంతకన్నా ఎక్కువ ఆసక్తికరంగా రూపొందించారనే అంచనాలు కలిగేలా చేసింది ఈ ప్రోమో.   

 

Follow Us:
Download App:
  • android
  • ios