Asianet News TeluguAsianet News Telugu

'అంతరిక్షం' ట్విట్టర్ రివ్యూ!

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో వరుణ్ తేజ్ మరో కొత్త కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అదే 'అంతరిక్షం'. 'ఘాజీ' వంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను రూపొందించాడు

anthariksham movie twitter review
Author
Hyderabad, First Published Dec 21, 2018, 9:37 AM IST

వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే హీరో వరుణ్ తేజ్ మరో కొత్త కథతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అదే 'అంతరిక్షం'. 'ఘాజీ' వంటి సినిమాను రూపొందించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాను రూపొందించాడు.

సినిమా టీజర్, ట్రైలర్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అతిథిరావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను క్రిష్ నిర్మించారు.

క్రిస్మస్ వీక్ ని క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో మొదటిసారిగా వచ్చిన ఈ స్పేస్ ఫిల్మ్ కి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ ల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సాదాసీదాగా ఉందని, పాత్రల పరిచయాలు, లవ్ స్టోరీ, అంతరిక్షంలోకి వెళ్లడం వంటి సన్నివేశాలతో ఫస్ట్ హాఫ్ అయిపోతుందట.

మిగతా కథంతా సెకండ్ హాఫ్ లోనే చూపించారట. అక్కడక్కడా సినిమా బోరింగ్ గా ఉందని, కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ వర్క్ ఊహించిన స్థాయిలో లేదని పెదవి విరుస్తున్నారు. కొందరు మాత్రం సినిమా బాగుందని, ఒకసారి చూడొచ్చని అంటున్నారు. 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios