ఘాజి దర్శకుడు సంకల్ప్ రెండవ సినిమా అంతరిక్షంపై టాక్ ఎలా ఉన్నా చూసే వరకు ఏది మాట్లాడకూడదని ఆడియెన్స్ డిసైడ్ అయ్యారని చెప్పవచ్చు. ఓ వర్గం వారిలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మొదటి రోజు సినిమా టాక్ బావుందంటే నెక్స్ట్ డే నుంచి హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం ఖాయమని అంటున్నారు

ఇకపోతే ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు తప్పకుండా మరోసారి నేషనల్ లెవెల్లో అందరిని ఆకర్షిస్తాడని చెబుతున్నారు. సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం కథను ప్రేక్షకులకు ఎక్కించేసి సెకండ్ హాఫ్ అసలైన విజువల్ వండర్ ని చూపిస్తారట. వరుణ్.. దేవ్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అతను తీసుకునే నిర్ణయం కూడా సినిమాలో హైలెట్ అని తెలుస్తోంది.

ఇక అంతరిక్ష పయనం, అక్కడ జరిగే సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు సరికొత్త లోకాన్ని చుపిస్తాయట.తెలియని కొత్త విషయాలని దర్శకుడు క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేశాడు. చూసిన ప్రతి ఒక్కరు మంత్ర ముగ్దులవ్వడం పక్కా అంటూ సినీ ప్రముఖులు చెబుతున్నారు. సెన్సార్ నుంచి కూడా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మరి రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా రిలీజ్ అనంతరం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.