టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) తాజాగా నటించిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంటున్న తెలుస్తోంది.
నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంతో బిగ్ సక్సెస్ ను అందుకున్నాడు. అంతకుముందు హిట్లు లేక కాస్తా నిరాశలో ఉన్న నాని ఫ్యాన్స్ ఈ చిత్రం ఫుల్ జోష్ నిచ్చింది. నాని కూడా ఆ జోష్ లోనే వరుస సినిమాలతో ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ వరుసలో నాని నటించిన తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki). ఈ మూవీ రేపు (జూన్ 10) గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పూర్తి చేశారు. మరికొద్ది గంటల్లో ఈవెంట్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ అందింది. అంటే సుందరానికీ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ (Netfilx) దక్కించుకున్నట్టు తెలుస్తోంది. చిత్ర యూనిట్స్ ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నందున, నాని కూడా సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉండటంతో భారీ డీల్ కే ఒప్పుకున్నట్టు సమాచారం.
కానీ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కావడానికి చాలానే సమయం పడేట్టుగా ఉంది. త్వరలో ఆ వివరాలను రానున్నాయి. కాగా చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. ఇక సౌండ్ ట్రాక్స్ కూడా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్సే వస్తోంది. రేపు థియేటర్లలోకి వచ్చాక సుందర ప్రసాద్ ఎలాంటి రిజల్ట్ ను అందుకోనున్నాడో చూడాలి.
కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అంటే సుందరానికీ’లో నాని సుందర ప్రసాద్ పాత్రను పోషిస్తుండగా.. హీరోయిన్ నజ్రియా (Nazriya) లీలా పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి నవీన్ యేర్నెని, వై రవి శంకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ రిలీజ్ కానుంది.
