అంటే సుందరానికి సినిమాతో పర్వాలేదు అనిపించకున్నాడు నాని. ఈమూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కాని ఈ సినిమా నానీ ఆశలు ఆవిరి చేసింది. లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిన ఈమూవీ నుంచి తాజాగా ఓ వీడియో సాంగ్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు టీమ్.
పాపం నానీ..కెరీర్ స్పీడ్ అందుకుంటుంది అనకున్న టైమ్ లో ఏదో ఒక రకంగా కిందపడుతున్నాడు.. మళ్లీ పైకి లేస్తున్నాడు అనుకున్న టైమ్ లో మళ్ళీ కింద పడుతున్నాడు. వి, టక్ జగదీష్ లాంటి సినిమాలు పోయాయి అనకున్న టైమ్ లో .. శ్యామ్ సింగరాయ్ తో పైకి లేచాడు నేచురల్ స్టార్.. కాని మళ్ళీ అంటే సుందరానికి సినిమాతో ఒక మెట్టు దిగక తప్పలేదు ఫ్యామిలీ హీరోకు.
నాని, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సినిమా అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదలై పాజిటీవ్ రివ్యూలను తెచ్చుకుంది. కానీ కలెక్షన్లలో మాత్రం ఎలాంటి జోరు చూపించలేకపోతుంది. నాని గత సినిమాలను పోల్చితే ఈ సినిమా లోయెస్ట్ ఓపెనింగ్స్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఈ మూవీ కేవలం 60శాతం కలెక్షన్లను మాత్రమే సాధించింది.
ఇక ఈ వారం విరాటపర్వం సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాపై తెలుగు రాష్రాల్లో బాగా హైప్ ఉంది. ఈ సినిమానికి పాజిటీవ్ టాక్ వస్తే అంటే సుందరానికీ సినిమాకు బ్రేకులు పడ్డట్టే. కలెక్షన్ల విషయం పక్కన పెడితే ఈ సినిమాలో నాని, నజ్రియాల నటన అద్భుతం అని చెప్పాలి. కామెడీ టైమింగ్ తో పాటు డైలాగ్ డెలివరీలో కూడా ఇద్దరూ ఇరగదీశారని ఆడియన్స్ నుంచి రివ్యూలు వస్తున్నాయి. కాని కలెక్షన్ల పరంగానే నిరాశపరిచింది సినిమా.

అంటే సుందరానికి సినిమా నుంచి వరుసగా వీడియో సాంగ్స్ ప్లాన్ చేస్తున్నారు టీమ్...తాజాగా ఈ సినిమా నుండి ఎంత చిత్రం అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీనీ దర్శకుడు అద్భుతంగా చూపించాడు. వివేక్ సాగర్ సంగీతం మంచి ఫీల్‌ను కలిగిస్తుంది. నికేత్ బొమ్మి విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. లేటస్ట్‌గా రిలీజైన ఈ పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అంటే సుందరానికి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించారు. నాని అప్అండ్ డౌన్స్ ఇబ్బంది పడుతన్నాడు. కథల విషయంలో నానీ ఎంపిక కరెక్ట్ గా లేదు అన్న విమర్ష ఫ్యాన్స్ నుంచి వస్తుంది. నానీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టలేకపోతున్నాయి. నాని గత నాలుగైదు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేకపోయాయి.
