Asianet News TeluguAsianet News Telugu

కొత్త సినిమాను అనౌన్స్ చేసిన నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’లోనూ ఎన్టీఆర్ అంటూ క్రేజీ అప్డేట్..

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో జోరు పెంచుతున్నాడు. క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ ఫామ్ లోకి వస్తున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అలాగే బింబిసార మూవీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
 

Another solid announcement from Nandamuri Kalyan Ram, Crazy update saying NTR in Bimbisara too
Author
Hyderabad, First Published Jul 5, 2022, 4:15 PM IST

నందమూరి వంశం నుంచి టాలీవుడ్ ను ఏలుతున్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీనియర్ నటుడు నందమూరి బాలయ్య మాత్రమే. అయితే ఈ జాబితాలో ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) కూడా చోటుదక్కించుకుంటున్నాడు. ఆ దిశగా ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ ఫాంటసీ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘బింబిసార’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కు ఆడియెన్స్  నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.

ఇదే ఊపులో కళ్యాణ్ రామ్ తన నెక్ట్స్ మూవీని కూడా ప్రకటించారు. తన 19వ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు.. కాస్ట్ అండ్ క్రూ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై NKR19 వర్క్ టైటిల్ తో సినిమా రూపొందుతోంది. అయితే కళ్యాణ్ రామ్ 43వ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేస్తూ క్రేజీ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో కళ్యాణ్ ఓ టేబుల్ పై ఉన్న గన్స్ ను చేతితో తాకుతూ వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. సినిమా ఫుల్ యాక్షన్ తో కూడుకున్నదని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. తర్వలోనే ఫస్ట్ మరియు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. 

ఇదిలా ఉంటే... ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటించిన Bimbisara మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఆగస్టు 5న బింబిసార : పార్ట్ వన్ ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే ఈ చిత్రం గురించి తాజాగా క్రేజీ అప్డేట్ ను రివీల్ చేశారు. బింబిసార మూవీని దర్శక నిర్మాతలు నాలుగు పార్ట్ లుగా నిర్మిస్తున్నారని నందమూరి కళ్యాణ్ రామ్ తెలిపారు. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది రిలీజ్ కాగా.. సెకండ్ పార్ట్ ను వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తామని తెలిపారు. మంచి రెస్పాన్స్ వస్తే మాత్రం ఈ ఫ్రాంచైజీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా నటిస్తారని తెలిపారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం బింబిసార  చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం బింబిసార ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కళ్యాణ్ రామ్ మూవీలో ద్విపాత్రాభినయం చేశారు. మూవీలో మాత్రం కళ్యాణ్ ఫాంటాసీ యాక్షన్ తో అదరగొట్టారు. ట్రైలర్ చూసిన నందమూరి అభిమానులు ‘బింబిసార’తో కళ్యాణ్ కు సాలిడ్ హిట్ ఖాయమంటున్నారు. ఈ చిత్రాన్ని మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్లుగా క్యాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణీ అద్భుతమైన సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరి క్రిష్ణ సినిమాను నిర్మిస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios