సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా వివాదాలను సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలను ఆపడానికి టీడీపీ నేతలు చాలా మంది ప్రయత్నించారు. 

అయితే ఆ అడ్డంకులన్నీ దాటుకొని సెన్సార్ పూర్తి చేసుకొని రేపే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆన్ లైన్ లో టికెట్ల బుకింగ్ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, సినిమా విడుదల కారణంగా తమ మనోభావాలు దెబ్బతింటాయంటూ మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఈ కేసులో పిటీషన్ కు అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలపై స్టే ఇచ్చింది. ఈ సినిమా విడుదలను ఏప్రిల్ 15వరకు ఆపాలని పిటిషనర్ కోరారు.

ఈ కేసులో ప్రతివాదులుగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు, రాకేశ్ రెడ్డి, దీప్తి, బాలగిరి, నరేంద్రచారి, జీవీఆర్, జీవీ ఫిలిమ్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో, టీవీ చానెల్స్ లో కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ ను నిషేదించాలని కోర్టును పిటిషనర్ తరఫు లాయర్ కోరారు. కోర్టు ఇచ్చిన స్టేపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.