Asianet News TeluguAsianet News Telugu

‘వాల్తేరు వీరయ్య’ నుంచి మరో మాస్ అప్డేట్.. మాస్ మహారాాజా వచ్చేస్తున్నాడు!

మెగాస్టార్ చిరంజీవి -  శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రిలీజ్ కు సిద్ధం అవుతున్న మూవీ నుంచి బ్యాక్ టు బ్యాక్ మాస్ అప్డేట్స్ అందుతున్నాయి. తాజాగా మరో మాసీవ్ అప్డేట్ ను అందించారు మేకర్స్.

Another mass update from Waltair Veerayya Movie!
Author
First Published Dec 9, 2022, 5:56 PM IST

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్  (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. విడుదలకు సరిగ్గా నెల సమయం ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ మాస్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరో క్రేజీ  అప్డేట్ అందించారు. 

ఈ నెల డిసెంబర్ 12న సినిమా నుంచి మాస్ అప్డేట్ అందుతుందని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలకు దుమ్ములేచిపోతుండగా.. అభిమానుల కోసం మరో  మాస్ ట్రీట్ అందిస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కూడా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి అప్డేట్స్ మొదలైనప్పటి నుంచి రవితేజ  గురించి ఎలాంటి క్లూ రాలేదు. ఈసారి వచ్చే అప్డేట్ లో మాస్ మహారాజానే వస్తున్నాడని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.  

చిరంజీవి, రవితేజ మరోసారి కలిసి నటిస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. డిసెంబర్ 12 ఉదయం 11.07 నిమిషాలకు రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. రవితేజ లుక్ ఎలా ఉండబోతోందనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ అప్డేట్ అందిస్తూ రవితేజ మాస్ లుక్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. గొడ్డలితో సిలిండర్ ను లాక్కుంటూ వెళ్తున్న ఈ పోస్టర్ లుక్ అదిరిపోయింది. మొత్తానికి మరికొద్ది రోజుల్లో మాస్ జాతర ప్రారంభం కాబోతోంది. 

ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర యూనిట్ యూరోప్ కు వెళ్లింది. సినిమా మొత్తం పూర్తవ్వగా.. రెండు పాటలు బ్యాలన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. వాటిని ఈ 15 రోజుల్లో పూర్తి చేసేందుకు విదేశాలకు వెళ్లారు. షూటింగ్ గ్యాప్ లో ఫ్యామిలీతోనూ చిరంజీవి విహార యాత్రను ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios