బిగ్ బాస్ 3 వచ్చే వరకు ఈ షోకు సంబందించిన రూమర్స్ కి ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. రవ్వంత గాసిప్ కి కొండంత రూమర్స్ ని క్రియేట్ చేసి పలు కథనాలతో పలు వెబ్ మీడియాలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదలెట్టిన బిగ్ బాస్ ప్రస్థానం ఆయనతోనే కొనసాగాలని స్టార్ మా చేస్తోన్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. 

బిగ్ బాస్ 2 నానితో బాగానే నడిచినా మూడవ సీజన్ కు ఆయన ఉండాలని అనుకోవడం లేదు. దీంతో తప్పకుండా ఎన్టీఆర్ రావాల్సిందే అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కు ఎంతవరకు ఈ రియాల్టీ షోపై ఇంట్రెస్ట్ ఉందొ తెలియదు గాని RRR కోసం ఒక ఏడాది పాటు ఏ పనుల్లోకి వెళ్లను అని బల్క్ డేట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

అయితే ఇటీవల రూమర్స్ బాగానే వచ్చినప్పటికీ ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ టీమ్ మళ్ళీ ఎన్టీఆర్ తో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మొన్నటివరకు RRR షూటింగ్ లో బిజీగా గడిపిన ఎన్టీఆర్ కు దర్శకుడు రాజమౌళి రెస్ట్ తీసుకొమ్మని కాస్త గ్యాప్ ఇచ్చాడు. దీంతో విషయం తెలుసుకున్న బిగ్ బాస్ టీమ్ హోస్టింగ్ విషయంపై తీరిక లేకుండా తారక్ తో బేరాలు చేస్తున్నట్లు ఒక రూమర్ వైరల్ అవుతోంది. 

గతంలోనే 15 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో తారక్ కి రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా బిగ్ బాస్ గ్యాంగ్ సిద్ధమయినట్లు గాసిప్స్ గట్టిగా వచ్చాయి. ఇక ఇప్పుడు జక్కన్న ఇచ్చిన గ్యాప్ లో బిగ్ బాస్ టీమ్ దూరినట్లు కథనాలు రావడం గమనార్హం. ఈ విషయంలో బిగ్ బాస్ టీమ్ వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తే అభిమానుల అంచనాల్లో ఒక క్లారిటీ ఉంటుంది. లేకుంటే రూమర్స్ వల్ల అంచనాల్లో తేడా వస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెలువడుతున్నాయి.